వాలు జడలా వయ్యారంగా ఉన్న ఈ మొక్కను చూశారా?.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

వాలు జడలా వయ్యారంగా ఉన్న ఈ మొక్కను చూశారా?.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

మొక్కలను పెంచుకోవడానికి చాలా మంది ఇష్టపడుతారు. అందుకే మార్కెట్‌లోంచి మొక్కలను తెచ్చి ఇంట్లో పెంచుకుంటారు. కొందరైలే వాటిని కొన్ని తీగల సపోర్ట్‌తో రకరకాల ఆరాకాలో పెంచి.. ఇంటిని ఎంతో చక్కగా అలంకరిస్తారు. ఇళ్లలోనే కాదు.. నర్సరీలులో కూడా మొక్కలను వివిధ ఆకారాలలో పెంచుతుంటారు. అవి నెటిజన్లను ఎంతో ఆకర్షిస్తాయి. తాజాగా అలాంటి మొక్కనే విశాఖలోని డాల్ఫిన్ నేచర్ కన్జర్వేటివ్ సొసైటీ అందుబాటులోకి తీసుకొచ్చింది.

పార్క్‌లలో, నర్సరీలలో నిర్వహకులు మొక్కలను రకరకాల ఆకారాలో పెంచి పర్యాటకులను, నెటిజన్లను ఆకర్షిస్తుంటారు. తాజాగా ఇలానే వాలు జడ ఆకారంలో మొక్కను పెంచారు విశాఖకు చెందిన డాల్ఫిన్ నేచర్ కన్జర్వేటివ్ సొసైటీ వారు. వాలు జడ వలే వయ్యారంగా కనిపిస్తున్న ఈ మొక్క ఆ ప్రకృతి ఉద్యానవాననికి వెళ్లిన వారికందరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. విశాఖలోని డాల్ఫిన్ నేచర్ కన్జర్వేటివ్ సొసైటీ.. జీవ వైవిధ్య ఉద్యానవనంలో వందల సంఖ్యలో మొక్కలు, చెట్లను పెంచుతున్నారు. పూలు పండ్ల మొక్కలతో పాటు లెక్కలేనన్ని ఔషధ మొక్కలు కూడా అక్కడ ఒకే చోట కనిపిస్తాయి. వాటిలో ఒకటి ఈ వాలు జడ మొక్క.

వాస్తవానికి.. ఇది మునగకాయల మాదిరిగా ఉన్న రెండు మొక్కల సమూహం. వీటిని ఆఫ్రికన్ స్పియర్, సిండ్రికల్ స్నేక్ ప్లాంట్ అని పిలుస్తారు. ఈ మొక్కలు నిటారుగా మునగకాయల్లా పెరుగుతాయి. వాటిని కుండీల్లో పెంచి.. ఆకర్షణీయంగా మెలితిప్పితే.. జడ లాంటి ఆకారం వస్తుంది. జీవవైవిద్య ఉద్యానవనం నిర్వహిస్తున్న డాక్టర్ రామమూర్తి ఈ రెండు మొక్కల సమూహాన్ని ఈ విధంగా ఆకర్షనీయంగా మలిచారు.

సాన్సేవిరియా, సిలిండ్రికా అనే జాతికి చెందిన ఈ మొక్కలు తక్కువ నీరు, తక్కువ కాంతి ఉన్నచోట కూడా పెరుగుతాయి. ఇవి పొడుగ్గా గుండ్రంగా ఆకులను కలిగి ఉంటాయి. ఇవి తక్కువ నీటి లభ్యత కలిగిన ప్రాంతాల్లోనూ ఎలా నివసిస్తాయంటే.. నీటిని ఇవి ఆకులు, కాండాలు మూలాలలో నిల్వ చేస్తాయి. ఈ మొక్కలకు ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే..ఇవి ఎక్కవ మొత్తంలో విషవాయువులను గ్రహించి రాత్రి సమయంలో ఎక్కువ ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు