పొత్తికడుపులో ఏదో గుచ్చుకుంటుంది అంటూ ఆస్పత్రికి వ్యక్తి.. స్కాన్ చేసి నిర్ఘాంతపోయిన వైద్యులు

పొత్తికడుపులో ఏదో గుచ్చుకుంటుంది అంటూ ఆస్పత్రికి వ్యక్తి.. స్కాన్ చేసి నిర్ఘాంతపోయిన వైద్యులు

హైదరాబాద్‌లోని నల్లకుంటలో నివసిస్తున్న రవాణా వాహన డ్రైవర్ మురళి గత రెండు మూడు నెలలుగా నిరంతర కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో గత వారం కింగ్ కోటి ఆసుపత్రికి వచ్చాడు. అక్కడ వైద్యులు స్కాన్లు, ఇతర రోగనిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అతని కడుపులో పొడవైన సూది లాంటి వస్తువు ఉన్నట్లు పరీక్షల్లో తేలింది.

అతనికి విపరీతమైన 3 నెలల నుంచి విపరీతమైన కడుపునొప్పి ఉంది. పొత్తి కడుపులో ఏదో గుచ్చుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. దీంతో తట్టుకోలేక ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ అతడికి పరీక్షలు చేసిన డాక్టర్లు షాక్‌కు గురయ్యారు. అతని కడుపులో సూది లాంటి పొడవైన వస్తువు ఉన్నట్లు గుర్తించి.. సర్జరీ చేసి బయటకు తీశారు. ఈ ఘటన హైదరాబాద్​ నగరంలోని కింగ్ కోటి జిల్లా ఆసుపత్రి ( వైద్య విధాన పరిషత్​ జిల్లా ఆసుపత్రి)లో జరిగింది. సర్జరీ అనంతరం అతని కడుపు నుంచి బయటకు తీసింది దబ్బనం (పొడవైన సూది) గా గుర్తించారు. దీంతో అతనికి ప్రాణాపాయం తప్పింది

డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్‌ నల్లకుంటలో నివాసం ఉంటున్న దేవరకొండకు చెందిన మురళి ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాన్ని నడుపుతుంటాడు. 3 నెలలుగా కడుపు నొప్పితో అతడు బాధపడుతున్నారు. ఏదో గుచ్చుకుంటున్నట్లు అనిపిస్తోందని వారం కిందట కింగ్‌ కోఠి ఆస్పత్రికి వచ్చాడు. డాక్టర్లు స్కానింగ్, ఇతర టెస్ట్​లు చేసి, పొడవైన సూది లాంటి వస్తువు ఉన్నట్లుగా గుర్తించారు. దాంతో శుక్రవారం డాక్టర్ వెంకటేష్, డాక్టర్ బాల్‌రాజ్, అనస్థీషియాలజిస్ట్ శ్రీమంత్ నేతృత్వంలోని వైద్యుల బృందం సర్జరీ చేసింది. ఈ క్రమంలోనే బాధితుడి కడుపులో 5 అంగుళాల పొడవైన దబ్బనం ఉన్నట్లుగా వెల్లడైంది. దీంతో వైద్యులు ఒక్కసారిగా కంగుతిన్నారు. దబ్బనంను జాగ్రత్తగా బయటకు తీసి అతడిని ప్రాణాపాయం నుంచి కాపాడారు. అయితే వారు విచారించినప్పటికీ, మురళి సూది తన కడుపులోకి ఎలా వెళ్లిందో వెల్లడించలేదు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు