నాన్న తోపు హీరో.. అమ్మ స్టార్ హీరోయిన్.. కూతురు మాత్రం ఇలా.. ఆమె ఎవరంటే

నాన్న తోపు హీరో.. అమ్మ స్టార్ హీరోయిన్.. కూతురు మాత్రం ఇలా.. ఆమె ఎవరంటే

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నట వారసులు ఉన్నారు. సినిమా బ్యాగ్రౌండ్ నుంచి వచ్చి హీరోలుగా, హీరోయిన్స్ గా రాణిస్తున్న వారు చాలా మందే ఉన్నారు. అయితే కొంతమందికి మాత్రం అదృష్టం కలిసి రావడం లేదు. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సక్సెస్ కాలేకపోతున్నారు. అలాంటి వారిలో ఓ హీరోయిన్ కూడా ఉన్నారు. స్టార్ కిడ్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకుంది.

ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ కిడ్స్ ఉన్నారు. వారసులుగా వచ్చిన వారు చాలా మంది బ్యాక్ బ్యాక్ సినిమా ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. అయితే చాలా మంది నటవారసులు వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ హిట్స్ అందుకోలేక సతమతపడుతున్నారు. అయితే చాలా మంది హీరోలు, హీరోయిన్స్ గానే కాదు కొంతమంది స్టార్ కిడ్స్ విలన్స్ గాను మెప్పిస్తున్నారు. పైన కనిపిస్తున్న బ్యూటీ కూడా అంతే.. నా రూటే సపరేట్ అంటూ హీరోయిన్ పాత్రలతో పాటు విలన్ గాను మెప్పిస్తుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? అందంలో స్టార్ హీరోయిన్స్ కు ఏ మాత్రం తీసిపోదు.. నటనలోనూ ఆ అమ్మడు తోపే.. ఆ అమ్మడి నాన్న స్టార్ హీరో.. అలాగే ఆమె తల్లి ఇండ్రస్టీలో క్రేజీ హీరోయిన్ ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో కాదు.. ఒకప్పుడు హీరోయిన్ గా చేసి ఆ తర్వాత విలన్ గా మారింది అందాల భామ వరలక్ష్మీ శరత్ కుమార్. అందాల భామ వరలక్ష్మీ శరత్ కుమార్ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. వరలక్ష్మీ శరత్ కుమార్ తమిళ నటుడు శరత్ కుమార్, ఆయన మొదటి భార్య ఛాయ దంపతుల కుమార్తె. నటి రాధిక ఆమె సవతి తల్లి.

ఇక వరలక్ష్మీ ఒకప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేసింది. తమిళ్ లో వరుసగా సినిమాలు చేసింది ఆతర్వాత విలన్ రోల్ లోకి మారిపోయింది. తెలుగులో రవితేజ నటించిన క్రాక్ సినిమాలో జయమ్మ అనే పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో చేసింది. అలాగే వీరసింహారెడ్డి సినిమాలో కూడా బాలయ్య చెల్లెలిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించింది. ఇప్పుడు ఈ అమ్మడు సహాయక పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటుంది. ఇటీవలే ఈ అమ్మడు పెళ్లి చేసుకొని కొత్త జీవితం మొదలు పెట్టింది ఈ అమ్మడు.

Please follow and like us:
వార్తలు సినిమా సినిమా వార్తలు