శ్రావణ మాసం వస్తే చాలు అస్సలే మాంసాహారం తినకూడని చెబుతుంటారు. మరి అసలు వర్షాకాలంలో మాంసాహారం ఎందుకు తినకూడదు. దీనికి గల కారణాలు ఏవి? అలాగే శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినడం గురించి సైన్స్ ఏం చెబుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
హిందూ సంప్రదాయాల ప్రకారం శ్రావణ మాసానికి చాలా విషిష్టత ఉంటుంది. ఈ మాసం శివునికి ప్రీతికరమైన మాసం అంటుంటారు. అందుకే ప్రతి ఒక్కరూ శ్రావణ మాసంలో శివున్ని ఆరాధిస్తూ.. నిత్యం పూజలు చేస్తుంటారు. అంతే కాకుండా ఉపవాసాలు ఉంటూ శివారాధన చేస్తుంటారు.
ఇక శ్రావణ మాసం ఈ సంవత్సరం తెలుగు క్యాలెండర్ ప్రకారం జూలై 24 నుంచి ప్రారంభమై ఆగస్టు వరకు ఉంటుంది. ఈ సమయంలో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతుంటాయి. మహిళలు ఉపవాసాలు ఉండటమే కాకుండా వ్రతాలు చేసుకుంటారు. నిత్యం పూజ చేస్తూ ఆలయాలను సందర్శిస్తుంటారు. ముఖ్యంగా లిగో ధ్యానం, శివయ్యకు జలాభిషేకం చేసి తమ భక్తిని చాటుకుంటారు.
అలాగే శ్రావణ మాసంలో అస్సలే నాన్ వెజ్ తినకూడదని చెబుతుంటారు. అయితే దీని వెనుక ఒక కారణం ఉన్నదంట. అది ఏమిటంటే? శ్రావణ మాసంలో ఎక్కువగా పూజలు చేస్తుంటారు కాబట్టి మాంసాహారం తినకూడదని చెబుతుంటారు. ఇంతే కాకుండా శాస్త్రీయ పరంగా కూడా నాన్ వెజ్ తినక పోవడానికి అనేక కారణాలు ఉన్నాయంట.
శ్రావణ మాసం అనేది వర్షాకాలం మధ్యలో వస్తుంటుంది. అయితే వర్షాకాంలలో అనేక వ్యాధులు వ్యాపిస్తాయి. అలాగే ఈ సీజన్‌లో నీటి నాణ్యత బాగుండదు. ఇవన్నీ ఆరోగ్యంపై ప్రభావం చూపెడుతాయి. అంతే కాకుండా, శ్రావణ మాసంలో వాతావరణం చాలా తేమగా ఉండటం వలన జీర్ణ వ్యవస్థ కూడా చాలా బలహీనంగా ఉంటుందంట. అందువలన ఈ సమయంలో ఎక్కు ప్రోటీన్ ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం మంచిది కాదంట.
దీని వలన కడుపు సంబంధమైన సమస్యలు అధికం అవుతాయంట. మరీ ముఖ్యంగా కడుపు నొప్పి, గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వం టి సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ ఉన్నందున ఈ సీజన్‌లో అస్సలే మాంసాహారం తీసుకోకూడదని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు