మెగాస్టార్ చిరంజీవి తన విలక్షణమైన కథల ఎంపిక మరియు మేకోవర్‌లతో యువ తరంతో పోటీ పడేందుకు వ్యూహాత్మకంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఒక సినిమా నుండి మరొక సినిమాకు భిన్నమైన జానర్‌లను ఎంచుకోవడంతో పాటు, తన లుక్స్ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాతోపాటు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు మన శంకరవరప్రసాద్ గారు అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. చిరంజీవి చివరిగా నటించిన భోళాశంకర్ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మెహారమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఇప్పుడు అభిమానులంతా విశ్వంభర, అనిల్ రావిపూడి సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ సినిమాల షూటింగ్ వేగంగా జరుగుతుంది. విశ్వంభర సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తుండగా.. మరో హీరోయిన్ ఆషికా రంగనాథ్ సైతం కనిపించనుందని అంటున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. అదేవిధంగా శ్రీ రామనవమి రోజున ఓ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు చిరు కొత్త సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇప్పటికే కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన బింబిసార సినిమాతో వశిష్ట మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి సోషియో ఫాంటసీ కథతో చిరంజీవి సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం మెగా అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాలో చాలా మంది హీరోయిన్స్ కనిపించనున్నారని తెలుస్తుంది. అలాగే ఓ అందాల భామ మెగాస్టార్ చిరంజీవి సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనుంది. చేసింది కొన్ని సినిమాలే అయినా తన అందంతో నటనతో ఆకట్టుకుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

