మహేష్ బాబు, ఎన్టీఆర్‏తో బ్లాక్ బస్టర్స్.. స్టార్ హీరోలతో లవ్ ఎఫైర్స్.. 50 ఏళ్ల వయసులో స్టిల్ సింగిల్..

మహేష్ బాబు, ఎన్టీఆర్‏తో బ్లాక్ బస్టర్స్.. స్టార్ హీరోలతో లవ్ ఎఫైర్స్.. 50 ఏళ్ల వయసులో స్టిల్ సింగిల్..

ఒకప్పుడు సినీరంగంలో చక్రం తిప్పిన హీరోయిన్స్ ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. తక్కువ సమయంలోనే గ్లామర్ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన తరాలు.. ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. అందులో ఈ హీరోయిన్ ఒకరు. అప్పట్లో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది. 50 ఏళ్ల వయసులోనూ పెళ్లికి దూరంగా ఉంటుంది.

తెలుగు సినిమా ప్రపంచంలో అందం, అభినయంతో కట్టిపడేసిన హీరోయిన్లలో ఆమె ఒకరు. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించింది. అప్పట్లో సినీరంగంలో తనదైన ముద్ర వేసింది. గ్లామర్ బ్యూటీగా ఇండస్ట్రీని ఏలేసిన ఈ చిన్నది.. ఆ తర్వాత బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. హిందీలో వరుసగా హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు 50 ఏళ్ల వయసులోనూ పెళ్లికి దూరంగా సింగిల్ లైఫ్ గడిపేస్తుంది. అంతేకాదు.. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ మెయిన్ లీడ్ రోల్స్ పోషిస్తూ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ అవుతుంది. సీనియర్ హీరోలకు జోడిగా ఈ అమ్మడు అలరిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఆమె పేరు బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్. తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు.

అమీషా పటేల్.. తెలుగు, హిందీ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. ఒకప్పుడు భారతీయ సినిమా ప్రపంచంలో అగ్ర హీరోయిన్లలో ఆమె ఒకరు. ప్రస్తుతం ఆమె వయసు 50 సంవత్సరాలు. ఇప్పటికీ ప్రేమ, పెళ్లికి దూరంగా ఉంటుంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. తనకు పిల్లలంటే చాలా ఇష్టమని.. వారికి సేవలు చేయడం మరింత ఇష్టమని చెప్పుకొచ్చింది. తాను కొంతమంది అనాథ పిల్లలను దత్తత తీసుకున్నానని.. వారికి సంబంధించిన అన్ని విషయాలను చూసుకుంటున్నాని తెలిపింది. ఆరోగ్యం, చదువు, ఇతర అవసరాల ఖర్చులను తానే భరిస్తానని.. పేద పిల్లలకు భవిష్యత్తు అందించేందుకు ప్రయత్నిస్తానని తెలిపింది.

కెరీర్ మంచి ఫాంలో ఉండగానే అమీషాకు సంబంధించిన అనేక రూమర్స్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొట్టాయి. గతంలో ఆమె ఓ స్టార్ హీరోతో ప్రేమలో ఉందనే ప్రచారం నడిచింది. అలాగే ఓ వ్యాపారవేత్తను సైతం ప్రేమించిందని టాక్. అయితే తన ప్రేమ, పెళ్లి గురించి వచ్చే రూమర్స్ పై అమీషా అంతగా స్పందించలేదు.

Please follow and like us:
వార్తలు సినిమా సినిమా వార్తలు