శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో స్పర్శ దర్శన టోకెన్‌లు!.. వెబ్ సైట్లు ఇవే!

శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో స్పర్శ దర్శన టోకెన్‌లు!.. వెబ్ సైట్లు ఇవే!

శ్రీశైల మల్లన్నను దర్శించుకోవాలనుకునే భక్తులకు ఆలయ అధికారులకు శుభవార్త చెప్పారు. ఇటీవలే స్వామివారి ఉచిత స్పర్శ దర్శనాన్ని పునఃప్రారంభించిన అధికారులు తాజాగా ఈ దర్శనానికి టోకెన్‌ పద్దతిని ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. అది కూడా ఆన్‌లైన్‌ ద్వారా టోకెన్లు జారీ చేయనున్నట్టు తెలిపారు. ఇటీవల ప్రారంభించిన దర్శనానికి భక్తుల నుంచి అనూహ్య స్పందన రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.

శ్రీశైల మల్లన్నను దర్శించుకోవాలనుకునే భక్తులకు ఆలయ అధికారులకు శుభవార్త చెప్పారు. ఇటీవలే స్వామివారి ఉచిత స్పర్శ దర్శనాన్ని పునఃప్రారంభించిన అధికారులు తాజాగా ఈ దర్శనానికి టోకెన్‌ పద్దతిని ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. శ్రీశైలం మహా క్షేత్రంలో మల్లన్న భక్తుల సౌకర్యార్థం జూలై 1వ తేదీ నుంచి స్పర్శ దర్శనం ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ స్పర్శదర్శనానికి భక్తుల నుంచి అనూహ్య స్పందన రావడంతో పాటు, భక్తుల రద్దీ కూడా భారీ పెరిగింది. ఈ నేపథ్యంలో దీనిపై దృష్టి పెట్టిన ఆలయ అధికారులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా టోకెన్ల ద్వారా స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఈ టోకెన్లను కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని నిర్ణయించినట్టు ఆలయ ఈవో తెలిపారు.

రామాయణ కోసం రణబీర్, సాయి పల్లవి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..? మొత్తం బడ్జెట్ తెలిస్తే..

ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో రామాయణ ఒకటి. డైరెక్టర్ నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేసింది. ఇందులో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ తారల పారితోషికం వివరాలు తెగ వైరలవుతున్నాయి.

భారతీయ సినీపరిశ్రమలో ఇప్పటివరకు నిర్మించిన అతిపెద్ద.. అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాల్లో రామాయణ ఒకటి. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో దాదాపు రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. ఇటీవలే జూలై 3న విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. దీంతో ఈ సినిమా గురించి పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ నితేశ్ తివారీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో యష్ రావణుడి పాత్రలో నటిస్తుండగా.. రణభీర్ కపూర్ రాముడిగా పాత్రలో నటిస్తున్నారు. అలాగే సీత పాత్రలో సౌత్ బ్యూటీ సాయి పల్లవి నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో సన్నీ డియోల్ హనుమంతుడిగా కనిపించనున్నారు. బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు ఏ సినిమా నమోదు చేయని విజయాన్ని రామాయణ సినిమా సృష్టించనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాలో నటిస్తున్న సెలబ్రెటీల పారితోషికాల గురించి ఇప్పుడు నెట్టింట చర్చ నడుస్తుంది. రణబీర్, సాయి పల్లవి ఈ సినిమాకు ఎంతవరకు పారితోషికం తీసుకుంటున్నారో మీకు తెలుసా.. ? అయితే ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందామా. నివేదికల ప్రకారం రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమాకు రణబీర్ కపూర్ ఒక్కో భాగానికి రూ.75 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారట. అంటే రెండు భాగాలుగా మొత్తం రూ.150 కోట్లు సంపాదిస్తాడు. గతంలో రణబీర్ ఒక్కో మూవీకు రూ.50 కోట్లు తీసుకున్నారు.

అలాగే సీతమ్మ పాత్ర కోసం సాయి పల్లవి.. ఒక్కో భాగానికి రూ.6 కోట్లు పారితోషికం తీసుకుంటుంది. రెండు భాగాలకు మొత్తం రూ.12 కోట్లు తీసుకుంటుందని సమాచారం. ఇక గతంలో ఒక్కో సినిమాకు సాయి పల్లవి రూ.3 కోట్లు తీసుకుందట. ఇక ఇప్పుడు ఈ సినిమాకు 200 శాతానికి పైగా పారితోషికం తీసుకుంటుంది. ఈ మూవీ మొదటి భాగానికి రూ.900 కోట్లు.. రెండవ భాగానికి రూ.700 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. మొత్తం రూ.1600 కోట్లతో ఈ సినిమా రెండు భాగాలను నిర్మించనున్నారు. వచ్చే ఏడాది దీపావళికి ఈ సినిమా ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేయనున్నారు.

Please follow and like us:
వార్తలు సినిమా సినిమా వార్తలు