ఆ ముగ్గురు హీరోయిన్లకు భర్తగా, కొడుకుగా నటించిన రజినీకాంత్.. ఎవరెవరంటే..

ఆ ముగ్గురు హీరోయిన్లకు భర్తగా, కొడుకుగా నటించిన రజినీకాంత్.. ఎవరెవరంటే..

సినిమా ప్రపంచంలో సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేని ఓ సాధారణ కండక్టర్ పాన్ ఇండియా లెవల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. కానీ మీకు తెలుసా.. ? ముగ్గురు హీరోయిన్లకు భర్తగా, కొడుకుగా రజినీకాంత్ నటించిన చిత్రాలెంటో… ? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.

దాదాపు ఐదు దశాబ్దాలుగా సినిమా రంగుల ప్రపంచంలో చక్రం తిప్పుతున్న స్టార్ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్. ఏడు పదుల వయసులోనూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు. ఇటీవలే కూలీ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కానీ మీకు తెలుసా.. ముగ్గురు హీరోయిన్లకు భర్తగా, కొడుకుగా రజినీ నటించారు.

ఇంతకీ ఏఏ హీరోయిన్ కు భర్తగా, కొడుకుగా నటించారో తెలుసుకుందామా.. తమిళ దర్శకుడు కె. బాలచందర్ దర్శకత్వం వహించిన అపూర్వ రాగంగల్ సినిమాలో రజినీకాంత్, శ్రీవిద్య హీరోహీరోయిన్లగా నటించారు. ఆ తర్వాత 1991లో దళపతి చిత్రంలో రజినీకి తల్లి పాత్రలో శ్రీవిద్య కనిపించింది.

అలాగే సీనియర్ సుజాత, కమల్ హాసన్, రజినీకాంత్ కలిసి నటించిన సినిమా అవర్గల్. ఇందులో రజినీ, సుజాత భార్యభర్తలుగా నటించారు. ఆ తర్వాత 2002లో బాబా చిత్రంలో రజినీకి తల్లిగా కనిపించింది సుజాత. ఇక సీనియర్ నటి శ్రీలక్షితోనూ రజినీ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. వీరిద్దరు కలిసి నెట్రికన్ చిత్రంలో నటించారు. ఇందులో వీరిద్దరు భార్యభర్తలుగా నటించగా.. ఆ తర్వాత 1999లో వచ్చిన నరసింహా సినిమాలో రజినీకి తల్లిగా కనిపించింది శ్రీలక్ష్మి.

Please follow and like us:
వార్తలు సినిమా సినిమా వార్తలు