నాని హీరోగా నటించిన కృష్ణ గాడి వీర ప్రేమగాద సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతోనే హీరోయిన్ మెహరీన్ టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఈ సినిమాలో నాని తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ లు గుర్తున్నారా.?
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన కృష్ణగాడి వీరప్రేమ గాధ సినిమా గుర్తుందా.? హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతోనే మెహరీన్ హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ సినిమాలో నాని తో కలిసి ముగ్గురు చిన్నారులు నటించారు. వారిలో చుట్కీ పాత్రలో నటించిన అమ్మాయి గుర్తుందా.? తన క్యూట్ క్యూట్ నటనతో ప్రేక్షకులను నవ్వించింది ఆ చిన్నారి. ఆమె ఇప్పుడు ఇండస్ట్రీలో బిజీగా మారిపోయింది. సినిమాలు, సిరీస్ ల్లో నటిస్తూ బిజీ బిజీగా గడిపేస్తుంది. ఇంతకూ ఆ చిన్నది ఎవరో.? ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
ఆమె పేరు వాసంతికా. నాని కృష్ణగాడి వీరప్రేమ గాద సినిమా తర్వాత ఆ మధ్య విడుదలైన 90’s మిడిల్ కాల్స్ బయోపిక్ వెబ్ సిరీస్ లో కనిపించింది. సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. ఆ సినిమాలో ఫోటోను, 90’s వెబ్ సిరీస్ లో ఫోటోను పక్క ప్-పక్కన పెట్టి ఆ అమ్మడే ఈ అమ్మడు అంటూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. వాసంతికా పలు సినిమాల్లోనూ నటించింది. ఇక ఇప్పుడు 90’s వెబ్ సిరీస్ ద్వార మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది.
ప్పుడు0 వాసంతికా టాలీవుడ్ లో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన ఆమె ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తుంది. ప్రస్తుతం డాటర్ ఆఫర్ ప్రసాద్ రావు అనే సినిమాలో నటిస్తుంది. అలాగే హీరోయిన్ గా మావ అనే సినిమాలోనూ నటిస్తుంది వాసంతికా. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది తాజాగా కొన్ని ఫోటోలను పంచుకుంది. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

