మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిన చరణ్.. ఇటీవలే గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకులను అలరించాడు. ఇక ఇప్పుడు పెద్ది సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్, గేమ్ ఛేంజర్ వంటి చిత్రాల తర్వాత చరణ్ నటిస్తోన్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తీసుకువస్తున్నారు. ఇటీవల చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేసింది. ఇందులో చరణ్ లుక్స్, డైలాగ్స్, క్రికెట్ షాట్ సీన్ నెట్టింటిని షేక్ చేశాయి. ఇందులో బాలీవుడ్ నటుడు దివ్వేందు శర్మ కీలకపాత్ర పోషిస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ చిత్రీకరణ వేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నారు డైరెక్టర్ బుచ్చిబాబు.
అలాగే ఈ మూవీ సెట్స్ నుంచి కొన్ని ఫోటోస్ పంచుకున్నారు. ప్రస్తుతం చరణ్, దివ్యేందులపై యాక్షన్ ప్యాక్ట్ ఎపిసోడ్స్ షూట్ చేస్తున్నామని తెలియజేశారు. ఈమేరకు వారిద్దరితో కలిసి దిగిన ఫోటోలను పంచుకున్నారు. షూటింగ్ ఎంతో ఉత్సాహంగా సాగుతుందని అన్నారు. ప్రస్తుతం బుచ్చిబాబు షేర్ చేసిన ఫోటోస్ నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో రామ్ చరణ్ లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో మాస్ యాక్షన్ స్టైలీష్ లుక్ లో కనిపిస్తున్నాడు. మరోవైపు చరణ్ సైతం ఇవే ఫోటోస్ షేర్ చేయడం గమనార్హం.
ఈ చిత్రంలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తైనట్లు సమాచారం. ప్రస్తుతం నటీనటులపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది మార్చి 27న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.