సినిమా ఇండస్ట్రీలో ఆమె గొంతు ఓ అద్భుతం.. పాటకు ప్రాణం పొసే గొంతు ఆమెది.. ఆమె ఎవరో కాదు లెజెండ్రీ సింగర్ పి. సుశీల. ఎన్నో భాషల్లో పాటలు ఆలపించి ప్రేక్షకులను అలరించారు సుశీల. కొన్ని వేల పాటలు పాడారు సుశీల. అయితే ఆమె మనవడు టాలీవుడ్ హీరో.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశాడు.. ఆయన ఎవరో తెలుసా.?
ఆమె స్వరం స్వరరాగ గంగాప్రవాహం.. కోయిలను మరిపించిన సుమధుర వాణి.. ఆమె గళం ఉరికే ఝరి.. అది భక్తిగీతమైనా.. యుగళగీతమైనా.. జానపదమైనా.. ఆ గొంతులో అలవొకగా సాగాల్సిందే. మధుర్యాన్ని తన వంటపట్టించుకున్నారు గానకోకిల పద్మభుషణ్ పి.సుశీల. తెలుగులో ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించారు సుశీల. వివిధ భాషల్లో కలుపుకుని కొన్ని వేల పాటలు పాడారు. సుశీల.. ఎస్పీ బాలు కలిసి మరెన్నో పాటలను పాడారు. ఆమె అంటే ఆయనకు ఎంతో ఆత్మీయత… ఆయనంటే ఆమెకి ఎంతో అభిమానం. అందువల్లనే ఒకరి పేరును గురించి ఒకరు ప్రస్తావించకుండా పాటను గురించి మాట్లాడలేరు. ఇక ఈ గాన కోకిల మనవడు మన టాలీవుడ్ హీరో అన్న విషయం మీకు తెలుసా.? అవును సుశీల మనవడు తెలుగులో తోప్ హీరో.. అతను ఎవరంటే..
టాలీవుడ్ లో వందల పాటలు ఆలపించిన లెజెండరీ సింగర్ పి.సుశీలకు మనవడు వరసయ్యే నటుడు ఎవరో కాదు సాయికిరణ్. ‘నువ్వే కావాలి’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సాయి కిరణ్. ఆ తర్వాత ‘ప్రేమించు’, ‘మనసుంటే చాలు’, ‘ఎంత బావుందో’ తదితర చిత్రాల్లో హీరోగా నటించి మెప్పించాడు. కొన్ని సినిమాల్లోనూ సహాయక నటుడిగానూ మెప్పించాడు.
సాయి కిరణ్ ఇప్పుడు టాలీవుడ్ బుల్లితెరపై సత్తా చాటుతున్నాడు. గుప్పెడంత మనసు, కోయిలమ్మ, పడమటి సంధ్యరాగం సీరియల్స్ అతనికి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. 2010లోనే సాయికిరణ్కి వైష్ణవి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆతర్వాత ఇద్దరూ విడిపోయారు. ఈ నేపథ్యంలో తనతో పాటు ‘కోయిలమ్మ’ సీరియల్లో నటించిన స్రవంతిని పెళ్లాడాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తాను సింగర్ పి.సుశీల మనవడిని అని తెలిపారు. కానీ సుశీల గారు నాకు నాన్నమ్మ ఏమవుతారు అని బయట చెప్పుకోవడం నాకు నచ్చదు.. నన్ను నన్నుగా గుర్తించాలి అని తెలిపాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.