బిగ్ బాస్ సంజన చెల్లి తెలుగులో క్రేజీ హీరోయిన్.. ఆమె భర్త కూడా తోప్ హీరో..! ఆమె ఎవరో తెలుసా.

బిగ్ బాస్ సంజన చెల్లి తెలుగులో క్రేజీ హీరోయిన్.. ఆమె భర్త కూడా తోప్ హీరో..! ఆమె ఎవరో తెలుసా.

బిగ్ బాస్ సీజన్ 9లో తన ఆటతో ప్రేక్షకులను మెప్పించింది. తన ఆటతోనే కాదు చలాకీ తనంతో ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంది. నామినేషన్స్ లో ఉన్న ప్రతిసారి ఆమె ప్రేక్షకుల ఓటింగ్ తో సేవ్ అవుతూ వస్తుంది. ఇక ఈ అమ్మడు టాప్ 5కి వెళ్తుందని ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

బిగ్ బాస్ సీజన్ 9 మరింత రసవత్తరంగా సాగుతుంది. హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేస్తారా అని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ప్రతివారం హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. ఇక ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లేందుకు.. డిమాన్ పవన్, సంజన, దివ్య హౌస్ డేంజర్ జోన్ లో ఉన్నారని తెలుస్తుంది. ఈ ముగ్గురిలో ఒకరు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేస్తారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే హౌస్ లో ఉన్న సంజన గురించి ప్రేక్షకులకు ప్రత్యకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె హీరోయిన్ గా తెలుగులో సినిమాలు చేసింది.

ప్రభాస్ హీరోగా నటించిన బుజ్జిగాడు సినిమాలో సంజన హీరోయిన్ చెల్లిగా కనిపించింది. ఆతర్వాత హీరోయిన్ గా ఒకటి రెండు సినిమాలు చేసింది. అలాగే కన్నడ భాషలోనూ సినిమాలు చేసింది. ఇక సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీతో లైఫ్ ను లీడ్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఆమె చెల్లి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ అని మీకు తెలుసా.? తన అందంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. అంతే కాదు స్టార్ హీరోని పెళ్లి చేసుకుంది ఆ ముద్దుగుమ్మ. తెలుగులోనే కాదు తమిళ్ లోనూ సినిమాలు చేసింది ఆమె.. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఆ అందాల భామ పేరు నిక్కీ గల్రానీ. ఈ అందాల భామ సునీల్ హీరోగా నటించిన కృష్ణాష్టమి సినిమాలో హీరోయిన్ గా చేసింది. తెలుగులోనే కాదు తమిళ్, మలయాళ ఇండస్ట్రీలోనూ సినిమాలు చేసింది. ఇక ఈ అందాల భామ టాలీవుడ్ హీరో ఆది పినిశెట్టి ని వివాహం చేసుకుంది. 2022లో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ.. భర్తతో కలిసి రకరకాల ఫోటోలు షేర్ చేస్తుంది.

Please follow and like us:
వార్తలు సినిమా సినిమా వార్తలు