అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన కథతో నాని సినిమా.. కట్ చేస్తే ఊహించని రిజల్ట్.. ఏ మూవీనో తెలుసా?

అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన కథతో నాని సినిమా.. కట్ చేస్తే ఊహించని రిజల్ట్.. ఏ మూవీనో తెలుసా?

అల్లు అర్జున్, నాని.. టాలీవుడ్ లో ఈ స్టార్ హీరోలకు ఉన్న క్రేజ్ నెక్ట్స్ లెవెల్. బన్నీ ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకుంటే నాని బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల సినిమాలు ఇస్తున్నాడు. అయితే అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన ఓ కథతో నాని సినిమా తీశాడు..

పుష్ప, పుష్ప 2 సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిపోయాడు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ముఖ్యంగా పుష్ప 2 సినిమా బన్నీ క్రేజ్ ను అమాంతం పెంచేసింది. ఇప్పుడు అతనికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇక న్యాచురల్ స్టార్ నాని విషయానికి వస్తే.. సినిమా ఇండస్ట్రీలో స్వయంకృషితో పైకి ఎదిగిన నటుల్లో ఒకడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించి అతను ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారిపోయాడు. ఇక లేటెస్ట్ గా అతను నటించిన హిట్ 3 సినిమా వంద కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. అయితే గతంలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన ఓ కథతో న్యాచురల్ స్టార్ నాని సినిమా తీశాడు.. కట్ చేస్తే ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ మూవీ ఏంటో తెలుసుకుందాం రండి.

సినిమా ఇండస్ట్రీలో కథలు చేతులు మారడమనేది కామన్. ఒక హీరో చేయాల్సిన కథ వివిధ కారణాలతో వేరే హీరో దగ్గరకు వెళ్లడం ఇక్కడ పరిపాటిగా జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి అలా చేతులు మారిన సినిమాలు సూపర్ హిట్స్ అవుతుంటాయి. మరికొన్ని సార్లు ఫ్లాప్స్ కూడా అవుతుంటాయి. ఇదంతా హీరోల స్టోరీ సెలక్షన్ పై ఆధార పడి ఉంటుంది. ఒక్కోసారి వారి అంచనాలు కరెక్ట్ అవ్వొచ్చు.. మరోసారి తప్పు కావొచ్చు.అలా అల్లు అర్జున్, నానీల విషయంలో కూడా ఒక సినిమా చేతులు మారింది.

న్యాచురల్ స్టార్ నాని నటించిన సూపర్ హిట్ సినిమాల్లో గ్యాంగ్ లీడర్ ఒకటి. మనం లాంటి క్లాసిక్ సినిమాను తెలుగు ఇండస్ట్రీకి అందించిన విక్రమ్ కె కుమార్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక. కార్తికేయ విలన్ గా నటించాడు. రివేంజ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. నానికి మంచి పేరు తీసుకొచ్చింది. అయితే విక్రమ్ కె కుమార్ ఈ గ్యాంగ్ లీడర్ కథ ను ముందుగా అల్లు అర్జున్ కు చెప్పాడట. బన్నీకి కూడా ఈ కథ బాగా నచ్చిందట. దీంతో ఈ ప్రాజెక్టు ఆల్మోస్ట్ సెట్ అయినట్టేనని విక్రమ్ కే కుమార్ భావించారు. అయితే అప్పటికే చేతిలో ఉన్న సినిమాలో లేదా మరో కారణమో తెలియదు కానీ బన్నీ అనూహ్యంగా ఈ సినిమా నుంచి డ్రాప్ అయ్యాడట. దీంతో ఇదే కథను నానితో తెరకెక్కించాడు విక్రమ్ కే కుమరా్. గ్యాంగ్ లీడర్ తర్వాత కూడా బన్నీకి రెండు మూడు కథలు చెప్పాడట ఈ డైరెక్టర్. కానీ పెద్దగా వర్కవుట్ అవ్వలేదట.

Please follow and like us:
వార్తలు సినిమా సినిమా వార్తలు