క్రికెట్‌ బ్యాట్ కోసం వెళ్లి చంపేశాడు.. అతడికి క్రైమ్ సీన్స్ చూడటం అలవాటు.. షాకింగ్ విషయాలు

క్రికెట్‌ బ్యాట్ కోసం వెళ్లి చంపేశాడు.. అతడికి క్రైమ్ సీన్స్ చూడటం అలవాటు.. షాకింగ్ విషయాలు

హత్యకు గురైంది పదేళ్ల పాప. చంపింది పదోతరగతి కుర్రాడు. కానీ, ఇది తేలడానికి ఐదు రోజులు పట్టింది. మెడ, గొంతు, కడుపులో 20కి పైగా భయంకరమైన కత్తి పోట్లు. విచక్షణారహితంగా కసితీరా పొడిచి చంపేశాడు. కానీ, నాలుగు రోజుల వరకు చిన్న క్లూ కూడా దొరకలేదు. ఐదోరోజు మధ్యాహ్నం వరకూ ఇదే సీన్‌. ఆ తర్వాత.!

కూకట్‌పల్లి సహస్ర హత్య కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుపై సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ప్రెస్ మీట్ పెట్టి.. కీలక విషయాలు వెల్లడించారు. విచారణలో నిందితుడు పోలీసులను తప్పుదారి పట్టించాడన్నారు. ఈ నెల 18న బాలిక హత్య జరిగిందని.. దీనికి నెల క్రితమే నిందితుడు ప్లాన్ చేశాడన్నారు డీసీపీ సురేష్. బ్యాట్ కోసమే బాలిక ఇంటికి వెళ్లినట్లు విచారణలో బాలుడు చెప్పాడు. బ్యాట్‌ తీసుకొని వెళ్తున్న నిందితుడిని బాలిక అడ్డుకుంది. ఈ క్రమంలో ఆమెను నెట్టివేయడంతో గోడకు పడిందని డీసీపీ తెలిపారు. నిందితుడికి సోషల్ మీడియాలో క్రైమ్‌ సీన్స్‌ చూసే అలవాటు ఉంది. మా స్టైల్‌లో మేం విచారణ చేయడంతో నిందితుడు తప్పు ఒప్పుకున్నాడన్నారు డీసీపీ. తనిఖీల్లో నిందితుడి లేఖ, కత్తి దొరికింది. స్పెషల్ ఫోరెన్సిక్‌ టీం నిందితుడిని గుర్తించింది. ఘటన వెనుక ప్రత్యేకమైన ఉద్దేశాలున్నట్లు కనిపించడం లేదని సీపీ మహంతి అన్నారు. నిందితుడు బాలిక ఇంటికి వెళ్లడం ఇది రెండోసారి అని పోలీసులు తెలిపారు.

హత్యచేసిన తర్వాత ఆధారాలు దొరకకుండా చేయడం నిందితుడు నేర్చుకున్నాడు. క్రికెట్ బ్యాట్ కోసం వెళ్లానని పోలీసులకు తప్పుడు సమాచారం అందించాడు. లెటర్‌లో ఎక్కడా క్రికెట్ బ్యాట్ గురించి ప్రస్తావించలేదు. దేవుడి హుండీ కొట్టేసేందుకే వెళ్లినట్లు పోలీసుల నిర్ధారణలో తేలింది. డబ్బు కోసమే బాలుడు మైనర్ బాలిక ఇంటికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. బాలిక చనిపోయిన తర్వాత ఇంటి డోర్ పెట్టి బాలుడు గుట్టుచప్పుడు కాకుండా వెళ్ళిపోయాడు. రెగ్యులర్‌గా కత్తి పట్టుకొని తిరుగుతానని పోలీసు విచారణలో వెల్లడించాడు. పథకం ప్రకారమే డైరీలో నోట్ రాసుకున్నాడు నిందితుడు. తల్లిదండ్రులు కొడుకును సరైనమార్గంలో పెట్టలేకపోయారని పోలీసుల అంచనా వేశారు. హత్య చేసిన బాలుడి తల్లిదండ్రులను కూడా డీసీపీ విచారిస్తున్నారు.

నిందితుడు వెళ్లిన సమయంలో బాలిక నిద్రలో ఉంది. బాలుడి అలికిడితో బాలిక మేల్కొంది. బాలుడిని చూసి బాలిక షాక్ అయింది. వెంటనే బాలికపై బాలుడు దాడి చేశాడు. హత్య తర్వాత తాను రాసుకున్న లెటర్‌ను సజ్జపై దాచిపెట్టాడు. నిందితుడు బాలిక ఇంట్లోకి దూకే క్రమంలో థర్డ్ ఫ్లోర్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ బాలుడిని చూశాడని అంటున్నారు పోలీసులు. ఇది తమ విచారణలో కీలక క్లూగా మారిందని చెప్తున్నారు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు