తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకు గణనీయంగా పెరుగుతోంది. పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉన్నప్పటికీ, రాత్రి మరియు తెల్లవారుజామున మాత్రం తీవ్రంగా పడిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది. అరకు, విశాఖపట్నం జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఉదయం పూట దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో రోడ్లపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మినుములూరులో 10 డిగ్రీలు, పాడేరులో 12 డిగ్రీలు, అరకులో 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Please follow and like us:

