తెలంగాణ పరువును రోడ్డున పడేద్దామా అంటూ ఉద్యోగులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్రెడ్డి. పైసాపైసా కూడబెట్టి రాష్ట్రాన్ని నడిపిస్తున్నామ్. ఒకటో తేదీనే జీతాలిస్తున్నామ్. అయినా, సమ్మెలు, ధర్నాలు, ర్యాలీలు అంటూ రోడ్డెక్కితే.. ఎలా అంటూ ప్రశ్నించారు. ఆ వివరాలు ఇలా
తెలంగాణ పరువును రోడ్డున పడేద్దామా అంటూ ఉద్యోగులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్రెడ్డి. పైసాపైసా కూడబెట్టి రాష్ట్రాన్ని నడిపిస్తున్నామ్. ఒకటో తేదీనే జీతాలిస్తున్నామ్. అయినా, సమ్మెలు, ధర్నాలు, ర్యాలీలు అంటూ రోడ్డెక్కితే.. ఎలా అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించిన సీఎం.. ఇక మీఇష్టం అంటూ నిర్ణయాన్ని ఉద్యోగులకే వదిలిపెట్టారు. ప్రతి ఒక్కరూ ఎలాగైతే లెక్కలేసుకుని కుటుంబాన్ని నడుపుకుంటారో.. అలాగే తాను కూడా పైసాపైసా లెక్కపెట్టికునిమరీ.. రాష్ట్రాన్ని నడుపుతున్నానన్నారు రేవంత్రెడ్డి. కావాలనుకుంటే ముఖ్యమంత్రి హోదాలో స్పెషల్ ఫ్లైట్స్లో తిరగొచ్చు.. కానీ, తాను.. సాధారణ విమానాల్లో ఎకానమీ క్లాస్లో ప్రయాణిస్తున్నా.. ఎందుకంటే, ప్రతి విషయంలో దుబారా ఖర్చులు తగ్గించుకుని.. రాష్ట్రాన్ని నడిపిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.
ప్రజలిచ్చిన ఈ ముఖ్యమంత్రి పదవిని ఎంతో బాధ్యతగా తీసుకుని పనిచేస్తున్నట్టు చెప్పారు రేవంత్. తెలంగాణ రాష్ట్రం గౌరవంగా ముందుకు సాగాలంటే ఖర్చుల విషయంలో స్వీయ నియంత్రణ అవసరమన్నారు. లేదంటే మన పరువే బజారున పడుతుందంటూ ఉద్యోగులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు రేవంత్రెడ్డి. ఎన్ని ఆర్థిక కష్టాలున్నా.. ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు వేస్తున్నామని.. ఇలాంటి పరిస్థితుల్లో సమ్మెలు, ధర్నాలు, ర్యాలీలు అంటూ రోడ్డెక్కితే.. ఉన్న వ్యవస్థ కుప్పకూలుతుందని.. ఇక మీ ఇష్టం అంటూ నిర్ణయాన్ని ఉద్యోగులకే వదిలేశారు రేవంత్రెడ్డి.