చేవెళ్ల బస్సు ప్రమాదంలో 19 మంది మరణించారు. ఈ బస్సు ప్రమాదంలో 20 మందికి పైగా గాయపడ్డారు.. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఈ దుర్ఘటనపై చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, చేవెళ్ల బస్సు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. తాండూరు మండలం హజీపూర్‌కు చెందిన లక్ష్మీ, బందెప్ప దంపతులను బస్సు ప్రమాదం బలితీసుకుంది.
చేవెళ్ల బస్సు ప్రమాదంలో 19 మంది మరణించారు. ఈ బస్సు ప్రమాదంలో 20 మందికి పైగా గాయపడ్డారు.. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఈ దుర్ఘటనపై చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, చేవెళ్ల బస్సు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. తాండూరు మండలం హజీపూర్‌కు చెందిన లక్ష్మీ, బందెప్ప దంపతులను బస్సు ప్రమాదం బలితీసుకుంది. ఆసుపత్రికని వెళ్లిన అమ్మానాన్న ఇక రారని, లేరని తెలిసి ఇద్దరు కూతుళ్లు కన్నీరు పెడుతుంటే ..చూసేవాళ్ల గుండె చెరువయింది. హచీపూర్ గ్రామస్తులు ఆ చిన్నారులకు అండగా నిలిచారు. లక్ష్మీ, బందెప్ప మృతదేహాలను తీసుకెళ్లేందుకు చేవేళ్ల హాస్పిటల్‌కు చేరుకున్నారు. అక్కడ ఇద్దరూ చిన్నారులు కన్నీరు పెడుతుంటే.. అక్కడున్నవారంతూ కంటతడిపెట్టారు.
కాగా.. మరణించిన వారి కుటుంబసభ్యుల రోదనలతో చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రి దృశ్యాలు హృదయవిదారకంగా మారాయి.. బంధువుల రోదనలతో ఆస్పత్రి ప్రాంగణం మార్మోగుతోంది.. పేరెంట్స్‌ను కోల్పోయి కొందరు.. బిడ్డలను కోల్పోయి ఇంకొందరు .. ఎవరిని కదిపినా గుండెలు అవిసేలా రోదిస్తున్నారు.
కాగా.. మృతదేహాలకు పోస్టుమార్టం కొనసాగుతోంది.. ఇప్పటికే.. పలు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసి.. కుటుంబసభ్యులకు అందజేసినట్లు పోలీసులు తెలిపారు.

