తెలుగులో చాలామంది ఆడియెన్స్ కు ఫేవరెట్ హీరోయిన్ ఆమె. అలాగనీ ఆమె తెలుగులో పెద్దగా సినిమాలేమీ చేయలేదు. కేవలం ఒక్క సినిమాలోనే హీరోయిన్ గా కనిపించింది. అయితేనేం.. తన క్యూట్ యాక్టింగ్ తో ఆడియెన్స్ మనసులు కొల్లగొట్టింది. ముఖ్యంగా సినిమాలో పెద్ద గొంతేసుకొని ఆమె చెప్పిన డైలాగులకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
కింగ్ నాగార్జున రూట్ మార్చారు.. హీరోగా ఇన్నాళ్లు అలరించిన నాగార్జున ఇప్పుడు విలన్ గా అదరగొడుతున్నారు. రీసెంట్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమాలో నాగార్జున నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించారు. నిజానికి కింగ్ నాగార్జున కూలీ సినిమాలో సూపర్ స్టార్ ను డామినేట్ చేశాడని కొంతమంది అభిమానులు అంటున్నారు. ఇక సోషల్ మీడియాలో నాగార్జున రీల్స్ షేక్ చేస్తున్నాయి. కూలీ సినిమాలో నాగార్జున పాత్రకు గతంలో ఆయన నటించిన రక్షకుడు సినిమాలో సోనియా సాంగ్ ను యాడ్ చేసి సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్నారు తమిళ్ అభిమానులు. ఇదిలా ఉంటే ఇదిలా ఉంటే ఇటీవల నాగార్జున రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు.
సీనియర్ హీరో జగపతిబాబు హోస్ట్ గా మారి జయమ్ము నిశ్చయమ్మురా అనే ప్రోగ్రాం చేస్తున్నారు. ఈ టాక్ షో ఓ ప్రముఖ ఛానెల్ లో టెలికాస్ట్ అవుతుంది. ఈ ప్రోగ్రాం కు మొదటి ఎపిసోడ్ కు గెస్ట్ గా కింగ్ నాగార్జున హాజరయ్యారు. ఈ టాక్ షోలో జగపతిబాబు, నాగార్జున కలిసి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు. ఈ క్రంమలోనే షోలో నాగార్జునకు సర్ప్రైజ్ ఇచ్చాడు జగపతి బాబు. నాగార్జున నటించిన కల్ట్ క్లాసిక్ గీతాంజలి సినిమా హీరోయిన్ గిరిజ వీడియో బైట్ ప్లే చేశారు.
చాల కాలం తర్వాత హీరోయిన్ గిరిజను చూసి నాగ్ షాక్ అయ్యారు. ఆమె అప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయారు. నటనకు గుడ్ బై చెప్పేసి విదేశాల్లో సెటిల్ అయ్యింది ఈ హీరోయిన్. గీతాంజలి సినిమాలో తన క్యూట్ యాక్టింగ్ తో ఆడియెన్స్ మనసులు కొల్లగొట్టింది. ముఖ్యంగా సినిమాలో పెద్ద గొంతేసుకొని ఆమె చెప్పిన డైలాగులకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అయితే మరిన్ని సినిమాల్లో ఈ అందాల తారను చూడాలనకున్నవారికి నిరాశే ఎదురైంది. ఒకే ఒక్క సినిమాతోనే టాలీవుడ్ లో తన ప్రస్థానాన్ని ముగించింది. 1969లో బ్రిటన్లో జన్మించిన గిరిజ సెట్టార్ కు భరత నాట్యంలోనూ అనుభవముంది. 2003లో యోగా తత్వశాస్త్రం, ఆధ్యాత్మిక మనస్తత్వశాస్త్రంలో డాక్టరల్ థీసెస్ పూర్తి చేసింది. ఇదే సమయంలో గీతాంజలి సినిమా కోసం మణిరత్నం ఆమెను ఇండియా తీసుకొచ్చారు. దీంతో పాటు మలయాళం, హిందీ భాషల్లో కూడా చెరో రెండు సినిమాల్లో నటించింది