ఆషాఢం జాతర మొదలైంది..గోల్కొండ జగదాంబికకు తొలి బోనం
శివసత్తుల పూనకాలు.. పోతరాజుల విన్యాసాలు.. ఘటాలు, ఫలహార బండ్ల ఊరేగింపులు.. నెత్తిన బోనం పెట్టుకుని తరలివచ్చే మహిళలతో బోనాల పండగ అంగరంగవైభవంగా జరుగుతుంది. తొలి బోనం సమర్పించే గోల్కొండలో బోనాల పండుగ కోలాహలం మొదలైంది. గోల్కొండ కోటలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.…