దుర్గం చెరువు ఆత్మహత్యలకు నిలయంగా మారుతోంది.. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి కేంద్రంగా ఆత్మహత్యలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.. గత నెల రోజుల వ్యవధిలో దుర్గం చెరువులో దూకి ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.. మరొకరిని పోలీసులు రక్షించారు.
దుర్గం చెరువు ఆత్మహత్యలకు నిలయంగా మారుతోంది.. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి కేంద్రంగా ఆత్మహత్యలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.. గత నెల రోజుల వ్యవధిలో దుర్గం చెరువులో దూకి ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.. మరొకరిని పోలీసులు రక్షించారు. ఈ క్రమంలోనే.. తాజాగా.. హైదరాబాద్‌లోని మాదాపూర్ దుర్గం చెరువులో ఓ వ్యాపారి మృతదేహం లభ్యమవ్వడం కలకలం రేపింది. మృతుడు సికింద్రాబాద్ తిరుమలగిరికి చెందిన చంద్రేష్ జైన్‌గా పోలీసులు గుర్తించారు. చంద్రేష్ జైన్ పై గురువారం అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. గురువారం అతను దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
సికింద్రాబాద్ తిరుమలగిరికి చెందిన చంద్రేష్ జైన్(34) వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయాడు.. దీంతో గత కొద్దిరోజులుగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలోనే.. చంద్రేష్ జైన్ తండ్రి కూడా మరణించాడు.. దీంతో చంద్రేశ్ మానసికంగా ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలోనే.. చంద్రేష్ జైన్ గురువారం దుర్గం చెరువు వద్దకు వచ్చిన ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. చంద్రేశ్ కనబడకుండా పోవడంతో కుటుంబ సభ్యులు గురువారం అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలోనే.. జైన్ మృతదేహం శుక్రవారం ఉదయం దుర్గం చెరువులో తేలుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మాదాపూర్ పోలీసులు.. మృతదేహాన్ని వెలికి తీసి.. చంద్రేశ్ గా గుర్తించారు.. అనంతరం కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.