డిగ్రీ అర్హతతో BSNLలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. సెలక్ట్‌ అయితే లైఫ్‌ సెటిలంతే!

డిగ్రీ అర్హతతో BSNLలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. సెలక్ట్‌ అయితే లైఫ్‌ సెటిలంతే!

టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ లో 2026 సంవత్సరానికి సంబంధించి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (SET) పోస్టుల భర్తీ కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 120 సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (SET) ఉద్యోగాలను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో టెలికాం స్ట్రీమ్ పోస్టులు 95, ఫైనాన్స్ స్ట్రీమ్ పోస్టులు 25 వరకు ఉన్నాయి..

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL).. 2026 సంవత్సరానికి సంబంధించి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (SET) పోస్టుల భర్తీ కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 120 సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (SET) ఉద్యోగాలను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో టెలికాం స్ట్రీమ్ పోస్టులు 95, ఫైనాన్స్ స్ట్రీమ్ పోస్టులు 25 వరకు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజనీరింగ్, ఫైనాన్స్‌లో అర్హత కలిగిన యువత ఈ ప్రభుత్వ రంగ సంస్థలో కెరీర్‌ను నిర్మించుకోవడానికి ఇదొక అద్భుతమైన అవకాశం. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు నుంచి (ఫిబ్రవరి 5, 2026) ప్రారంభమవుతుంది. మార్చి 7, 2026వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరిస్తారు.

టెలికాం స్ట్రీమ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఎలక్ట్రానిక్స్, టెలీకమ్యునికేషన్‌, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రికల్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్‌ విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఇక ఫైనాన్స్ స్ట్రీమ్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు CA (చార్టర్డ్ అకౌంటెంట్) లేదా CMA (కాస్ట్ & మేనేజ్‌మెంట్ అకౌంటెంట్)లో అర్హత అవసరం. అభ్యర్ధుల కనీస వయస్సు 21 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 30 సంవత్సరాలుగా నిర్ణయించారు. OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, వికలాంగ అభ్యర్థులకు నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో మార్చి 7 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తును సమర్పించిన తర్వాత మార్చి 8 నుంచి 15 వరకు అప్లికేషన్‌ సవరణ విండో అందుబాటులో ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) ద్వారా ఎంపిక జరుగుతుంది. ఈ పరీక్ష మార్చి 29, 2026న నిర్వహిస్తారు. దరఖాస్తు రుసుము కింద జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు రూ. 2,500, SC/ST/PWBD అభ్యర్ధులు రూ. 1250 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ. 24,900 నుంచి రూ.50,500 వరకు జీతంగా చెల్లిస్తారు. ప్రొబేషన్ పూర్తయిన వారికి పదోన్నతితోపాటు ప్రభుత్వ నిబంధనల మేరకు అలవెన్సులు, ఇతర ప్రయోజనాలు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం కావాలని కలలు కంటున్న ఇంజనీరింగ్. ఫైనాన్స్ నేపథ్యం ఉన్న అభ్యర్థులకు BSNL SET చేపట్టిన ఈ నియామకాలు ఒక గొప్ప అవకాశం. మంచి జీతం, స్థిరమైన ఉపాధి, వృద్ధి అవకాశాలను అందించే ఈ పోస్టుకు అర్హత కలిగిన అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిచారు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు