వాకింగ్ వల్ల బరువు తగ్గేందుకు కూడా మేలు చేస్తుంది. డయాబెటిస్, బీపీ తగ్గించడంలో కూడా వాకింగ్ ప్రభావవంతంగా పనిచేస్తుంది. అయితే, ఈ వాకింగ్‌లో నడిచే వేగాన్ని బట్టి రెండు రకాల వాకింగ్‌లు ఉన్నాయి. ఒకటి వేగంగా నడవటం దీన్నే బ్రిస్క్ వాకింగ్ అంటారు. మరొకటి నెమ్మదిగా నడవటం. ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనేది తప్పనిసరిగా తెలుసుకోవాలి..
మంచి ఆరోగ్యం కోసం ప్రజలు సరైన ఆహారంతో పాటు తగిన వ్యాయామం కూడా చేస్తుంటారు. ఇందులో శారీరక వ్యాయామం కోసం ఎక్కువ మంది ప్రజలు వాకింగ్ చేస్తుంటారు. ఎందుకంటే వాకింగ్ చేయడం చాలా ఈజీ. రోజూ వాకింగ్ చేయడం వల్ల చాలా లాభాలు ఉంటాయని నిపుణులు కూడా చెబుతుంటారు. వాకింగ్ ఎఫెక్ట్‌తో దీర్ఘకాలంలో ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. వాకింగ్ వల్ల బరువు తగ్గేందుకు కూడా మేలు చేస్తుంది. డయాబెటిస్, బీపీ తగ్గించడంలో కూడా వాకింగ్ ప్రభావవంతంగా పనిచేస్తుంది. అయితే, ఈ వాకింగ్‌లో నడిచే వేగాన్ని బట్టి రెండు రకాల వాకింగ్‌లు ఉన్నాయి. ఒకటి వేగంగా నడవటం దీన్నే బ్రిస్క్ వాకింగ్ అంటారు. మరొకటి నెమ్మదిగా నడవటం. ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనేది తప్పనిసరిగా తెలుసుకోవాలి..
సాధారణ వేగంతో నడవటం కంటే బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. వేగంగా నడవటం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుంది. బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. వేగంగా నడవటం వల్ల రక్తప్రసరణ బాగుంటుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు రావు. అంతేకాదు.. సాధారణ వాకింగ్‌తో పోల్చితే బ్రిస్క్ వాకింగ్ వల్ల ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి. బరువు తగ్గాలనుకునేవారికి బ్రిస్క్ వాకింగ్ మంచి ఎంపిక.
బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల ఫిట్‌నెస్ లెవెల్స్ పెరుగుతాయి. అలసట తగ్గుతుంది. నిత్యం ఎనర్జిటిక్‌గా ఉండొచ్చు. సాధారణ వాకింగ్‌తో పోల్చితే బ్రిస్క్ వాకింగ్ చేస్తే ఎండార్పిన్లు ఎక్కువగా రిలీజ్ అవుతాయి. దీని వల్ల ఒత్తిడి తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా మారుతుంది. శారీరక సమస్యలు ఉన్నవారు, కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడేవారు, నరాల సమస్య ఉన్న వారు నెమ్మదిగా నడవటం మంచిది. నెమ్మదిగా నడిస్తే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. డయాబెటిస్ ఉన్నవారు రెగ్యులర్‌గా నెమ్మదిగా నడవటం మంచిది. నెమ్మదిగా నడవటం వల్ల మైండ్‌ఫుల్‌నెస్ అలవాటు అవుతుంది. దీని వల్ల మానసికంగా ఆరోగ్యంగా ఉండవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)