ఛైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించాడు మానస్. ఆ తర్వాత హీరోగానూ అదృష్టం పరీక్షించుకున్నాడు. బిగ్ బాస్ షోలోనూ సందడి చేశాడు. ఇక బ్రహ్మముడి సీరియల్ తో బుల్లితెరపై స్టార్ నటుడిగా మారిపోయడు. ఇప్పుడు సూపర్ హిట్ కామెడీ షో జబర్దస్త్ కు యాంకర్ గానూ అలరిస్తున్నాడు.
సూపర్ హిట్ సీరియల్ బ్రహ్మముడి తో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు మానస్ నాగులపల్లి. ఇందులో రాజ్ గా అతని అభినయం అందరినీ ఆకట్టుకుంది. అంతకు ముందు చాలా సినిమాలు, సిరీసుల్లో హీరోగా, సహాయక నటుడిగా యాక్ట్ చేశాడు. బిగ్ బాస్ ఐదో సీజన్ లోనూ మెరిశాడు. కానీ బ్రహ్మముడి సీరియల్ తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలే జబర్దస్త్ యాంకర్ గానూ బాధ్యతలు స్వీకరించాడీ హ్యాండ్సమ్ యాక్టర్. మొత్తానికి టీవీ షోస్, ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ తో రెండు చేతులా సంపాదిస్తున్నాడు మానస్. ఈ క్రమంలోనే అతను కొత్త ఇల్లు కొనుగోలు చేశాడు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో ఓ ఫ్లాట్ ను కొన్న మానస్ తాజాగా గృహ ప్రవేశం కూడా చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను మానస్ తల్లి పద్మిని సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. డ్రీమ్ హౌస్ కల నెరవేరిందని తెలిపింది. భర్త ఎన్వీ రావు, కుమారుడు మానస్, కోడలు శ్రీజ, మనవడు ధ్రువతో కలిసి గృహప్రవేశం చేసినట్లు ఆమె తెలిపింది. ఈ వేడుకలో మానస్ కుటుంబ సభ్యులతో పాటు అతి కొద్ది మంది స్నేహితులు, సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. కాగా మానస్ 2023లో శ్రీజను పెళ్లి చేసుకున్నాడు. వీరికి గతేడాది కుమారుడు ధ్రువ జన్మించాడు.
నరసింహ నాయుడు, వీడే, అర్జున్ తదితర చిత్రాల్లో బాలనటుడిగా మెప్పించాడు. ఆ తర్వాత 2011లో ‘ఝలక్’ సినిమాతో హీరోగా మారాడు. గ్రీన్ సిగ్నల్, కాయ్ రాజా కాయ్, గోలీ సోడా, ప్రేమికుడు, క్షీరసాగర మథనం సినిమాలతో అలరించాడు. ఆ తర్వాత బిగ్బాస్ తెలుగు 5వ సీజన్లో పాల్గొని గ్రాండ్ ఫినాలే వరకు వచ్చాడు. ఇక ఈ షో నుంచి బయటకు రాగానే కోయిలమ్మ, బ్రహ్మముడి సీరియల్స్ తో బుల్లితెర ఆడియెన్స్ ను పలకరించాడు. ఇప్పుడు పలు సీరియల్స్ తో పాటు జబర్దస్త్ షోకు యాంకర్ గానూ వ్యవహరిస్తున్నాడు.