బిగ్బాస్ సీజన్ 9 రెండో వారం నామినేషన్స్ హీటెక్కిస్తున్నాయి. ముఖ్యంగా మాస్క్ మ్యా్న్స్ హరీష్ వర్సెస్ హౌస్మేట్స్ అన్నట్లుగా సాగుతున్నాయి. తాజాగా విడుదలైన ప్రోమోలో సుమన్ శెట్టి తన కామెడీతో నవ్వులు పూయించాడు. ఇక హరీష్, ఇమాన్యుయేల్ అరుచుకుంటూ ఒకరి పైకి మరొకరు వెళ్లారు.
బిగ్బాస్ సీజన్ 9 రెండో వారం నామినేషన్స్ హాటుహాటుగా సాగుతున్నాయి. కామనర్స్ వర్సెస్ సెలబ్రెటీస్ మధ్య ఓ రెంజ్ లో ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. ఈరోజు ఎపిసోడ్ కు సంబంధించిన సెకండ్ ప్రోమోను రిలీజ్ చేశారు. అందులో హరీష్, ఇమాన్యుయేల్ మధ్య మరోసారి గొడవ మొదలైంది. కానీ ఈసారి ప్రోమోలో సంజన, సుమన్ శెట్టి నామినేషన్స్ ప్రక్రియ నవ్వులు పూయించింది.తాజాగా విడుదలైన ప్రోమోలో ముందుగా సంజన తన ఫస్ట్ నామినేషన్ సుమన్ శెట్టిని చేసింది. నేను ఎవర్నీ పర్సనల్ గా తొక్కలేదు అంటూ సంజన చెప్పగా.. పెయింట్ రాయించుకోవడానికి వచ్చి రాయండి రాయండి అని అన్నాడు. రాయండి మేడమ్ టైమ్ వేస్ట్ కాలు నొప్పెడుతుంది అంటే.. ఓపికతో ఉండండి అంటూ కౌంటరిచ్చింది సంజన. మీరు వస్తే రాయించుకుంటాను అంటూ తమ మాటలతో నవ్వులు పూయించాడు. ఇక తర్వాత సుమన్ శెట్టి ప్రియను నామినేట్ చేశాడు.
ఆ తర్వాత మనీష్ ను నామినేట్ చేశాడు. నేను అడిగి డోర్ తీసుకుని వెళ్లిపోవట్లేదు బ్రో అంటూ సుమన్ శెట్టి చెప్పగా.. ఎవరెందుకు వస్తున్నారో బేసిక్ రీజన్ నాకు తెలియాలి అన్నాడు మనీష్. మేమందరం దొంగలు కాదు కదా బాబాయ్ అని సుమన్ శెట్టి అనడంతో అందరూ తెగ నవ్వుకున్నారు.
ఇక తర్వాత భరణి ప్రియను నామినేట్ చేశాడు. ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్ మనీష్ ను నామినేట్ చేశాడు. రెండో నామినేషన్ హరీష్ ను చేశాడు. గుండు అంకుల్ అనడం బాడీ షేమింగ్ అయితే రెడ్ ఫ్లవర్ అంటే ఏంటీ అని సూటిగా అడిగాడు ఇమ్మాన్యుయేల్. నేను ఎక్కడ రెడ్ ఫ్లవర్ అనలేదు అంటూ బుకాయించాడు హరీష్. అందరూ చూశారన్న అని ఇమ్మాన్యుయేల్ అనగా.. మిమ్మల్ని అనలేదు అంటూ రెచ్చిపోయాడు. నేను మిమ్మల్ని అనలేదని ఇమ్మాన్యుయేల్ అనగా.. హరీష్ రెచ్చిపోయాడు. లిమిట్స్ లో ఉండాలి.. లిమిట్స్ దాటొద్దు.. అర్థమైందా అంటూ వేలు చూపించాడు హరీష్. నా ఇష్టం అని ఇమ్యాన్యూయేల్ అంటున్నా హే హే అంటూ పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఇమ్మూ మీద మీదకు వెళ్లాడు హరీష్. దీంతో సూపర్ మాస్క్ మ్యాన్ సూపర్ అంటూ వెటకారంగా నవ్వాడు ఇమ్మూ.