ఒరేయ్.. మరీ ఇలా ఉన్నారేంట్రా..! ప్రాణాలు తీసేలా ఉన్నారుగా.. హౌస్‌లో మరో వికెట్ అవుట్

ఒరేయ్.. మరీ ఇలా ఉన్నారేంట్రా..! ప్రాణాలు తీసేలా ఉన్నారుగా.. హౌస్‌లో మరో వికెట్ అవుట్

బిగ్‏బాస్ సీజన్ 9.. మొదటి రెండు వారాల తర్వాత ఆట తీరు పూర్తిగా మారిపోయింది. గత సీజన్స్ మాదిరిగానే హౌస్మేట్స్ చెత్త పంచాయితీలు, అరుపులు, గొడవలు తప్ప అంత ఇంట్రెస్టింగ్ గా సాగడం లేదు. ఇక గత చివరి రెండు ఎలిమినేషన్స్ తర్వాత ఇటు నామినేషన్స్, ఓటింగ్ పై కూడా జనాలకు అంతగా ఆసక్తి ఉండడం లేదు.

బిగ్ బాస్ సీజన్ 9లోకి కొత్త హౌస్ మేట్స్ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి రచ్చ డబుల్ అయ్యింది. కొంతమంది గొడవలతోనే ఎక్కువ కంటెంట్ ఇస్తున్నారు. మరికొంతమంది టాస్క్ ల్లో తమ సత్తా చాటుతున్నారు. ఇక ఈ వారం కెప్టెన్ అయ్యే హౌస్ మేట కోసం బిగ్ బాస్ రకరకాల టాస్క్ లు ఇచ్చాడు. హౌస్ మేట్స్ ను రెండు టీమ్స్ గా డివైడ్ చేసి గేమ్ ఆడించాడు.. చివరిగా ఈ రోజు ఓ టాస్క్ తో కెప్టెన్ ఎవరో డిసైడ్ చేశాడు. కాగా నేటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో హౌస్ కెప్టెన్సీ కంటెండర్స్ కు ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. హౌస్ లో ఓ సర్కిల్ గీసి.. అదులో ఓ టోపీ ఉంచి దానిని ఎవరైతే సొంతం చేసుకుంటారో .. వారు ఆ టోపీని బయట ఉన్న వారిలో ఒకరికి ఇస్తే వారు.. కెప్టెన్సీ కంటెండర్ల రేస్ లో ఉన్న ఒకరిని తీసేస్తారు అని చెప్పాడు బిగ్ బాస్.

కాగా కెప్టెన్సీ కంటెండర్లుగా రీతూ, ఇమ్మాన్యుయేల్, తనూజ, నిఖిల్, దివ్య, కళ్యాణ్ పోటీ పడ్డారు, ముందుగా నిఖిల్ టోపీ సొంతం చేసుకొని గౌరవ్ కు ఇచ్చాడు.. గౌరవ్ కళ్యాణ్ ను రేస్ నుంచి తీసేసాడు. ఆతర్వాత బజార్ మోగగానే కెప్టెన్సీ కంటెండర్లు టోపీ కోసం పోటీ పడ్డారు. కాగా ఈసారి ఇమ్మూ సొంతం చేసుకున్నాడు. ఆ టోపీని సంజనకు ఇచ్చాడు. అయితే సంజన దివ్యను రేస్ నుంచి తొలగించింది. దాంతో దివ్య సంజనతో వాదనకు దిగింది. మీరు ఇమ్మాన్యుయేల్ కెప్టెన్ అవ్వాలి అనుకుంటే నిఖిల్ ను తీసెయ్యాలి.. మీకు అర్ధం కాదా గేమ్ అంటూ అరిచింది దివ్య.

ఆతర్వాత బజార్ మోగగానే మరోసారి ఇమ్మాన్యుయేల్ టోపీ సొంతం చేసుకొని ఈసారి మధురికి ఇచ్చాడు. మాధురి నిఖిల్ ను రేస్ నుంచి తీసేసింది. ఆతర్వాత కూడా ఇమ్మూనే టోపీ సొంతం చేసుకున్నాడు. ఈసారి కూడా మాధురికే ఇచ్చాడు. ఆమె రీతూని తీసేసింది. చివరిగా తనూజ, ఇమ్మాన్యుయేల్ మిగిలారు. అందులోనూ ఇమ్మూనే గెలిచాడు. ఫైనల్ గా ఇమ్మాన్యుయేల్ కెప్టెన్ అయ్యాడు. అయితే చివరిలో తనూజ కళ్లు తిరిగి పడిపోవడం చూపించారు. ఆమె కళ్లు తిరిగి పడిపోవడంతో ఇమ్మాన్యుయేల్ తోపాటు మిగిలిన సభ్యులు ఆమెను లేపే ప్రయత్నం చేశారు. ఈ ప్రోమో చూసిన ప్రేక్షకులు.. మీ టాస్క్ లేమోగాని ప్రాణాలు పోయేలా ఉన్నాయి అని కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది తనూజాది యాక్టింగ్ అని.. తనుజ సావిత్రిని మంచి పోయారు నటించడంలో అని కామెంట్స్ చేస్తున్నారు.

Please follow and like us:
వార్తలు సినిమా సినిమా వార్తలు