బ్లాస్లింగ్ న్యూస్.. బిగ్ బాస్ సీజన్ 9లోకి భోలే అన్న.. !

బ్లాస్లింగ్ న్యూస్.. బిగ్ బాస్ సీజన్ 9లోకి భోలే అన్న.. !

మాటలు.. ఆ పాటలు.. పద ప్రయోగాల్లో దిట్ట అయిన భోలే షావలి మళ్లీ బిగ్ బాస్ 9లోకి కూడా ఎంట్రీ ఇచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఫోక్ సింగర్‌గా.. మ్యూజిక్ డైరెక్టర్‌గా.. అనేక సినిమాల్లో పాటలు పాడటమే కాకుండా పలు ప్రవేట్ సాంగ్స్ కంపోజ్ చేసి తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు భోలే షావలి సన్నాఫ్ యాకుబలి.

భోలే షావలి.. బిగ్ బాస్ సీజన్ 8కు వచ్చేవరకు ఈయన పేరు చాలామందికి తెలీదు. బోలెడంత టాలెంట్ ఉన్నప్పటికీ మరుగున పడిపోయాడు ఈ సింగర్ కమ్ కంపోజర్. భోలే షావలి సన్నాఫ్ యాకుబలి.. అంటూ పాటబిడ్డగా బిగ్ బాస్ 7లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన భోలే.. అనతికాలంలో తన మార్క్ వేశాడు. టాస్కుల్లో పెద్దగా సత్తా చూపలేకపోయినా.. తన టాలెంట్‌ను ప్రదర్శించడంలో మాత్రం సక్సెస్ అయ్యాడు. మాటలు.. ఆ పాటలు.. పద ప్రయోగాలతో తనకంటూ ఫ్యాన్స్‌ను సెట్ చేసుకున్నాడు. సందర్భానికి తగ్గట్లు ట్యూన్ కట్టి అప్పటికప్పుడే పాటలు పాడటం.. తన మార్క్ పంచ్‌లతో రంజింపజేశాడు. అంతేనా.. కన్నడ సీరియల్ బ్యాచ్‌కు చాలా నిద్రలేని రాత్రుళ్లు మిగిల్చాడు. ఆ సమయంలో భోలే సోషల్ మీడియా మీమర్స్‌కు ఇచ్చిన కంటెంట్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాడు. అనూహ్య పరిస్థితుల్లో ఆ సీజన్‌లో పదోవారంలో ఎలిమినేట్ అయ్యాడు. ఇది అప్పట్లో షాకింగ్ ఎలిమినేషన్.

దీంతో భోలే క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకున్న బిగ్ బాస్ మేనేజ్‌మెంట్ అతనికి మరో అవకాశం కల్పించడానికి రెడీ అయినట్లు సమాచారం. అతను సీజన్ 9లోకి తీసుకొచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయట. మరి ఈ టాక్స్ ఎంతమేర నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఇక భోలే గురించి చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. ఆయన మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా. కిక్ 2లో ‘మమ్మీ కడుపులోన నాకు కంపర్ట్ లేదని’ పాట పాడింది ఈయనే. సంగీత దర్శకుడు కోటీ పాటు కెరియర్ స్టార్ట్ చేసిన భోలే.. పలు సినిమాల్లో మంచి సాంగ్స్ పాడాడు. సినిమాల్లో ఎంకరేజ్‌మెంట్ అంతగా లేకపోవడంతో ప్రైవేట్ ఆల్బమ్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అతను డిజైన్ చేసిన పాలమ్మినా.. పూలమ్మినా పాట.. సెన్సేషన్ క్రియేట్ చేసింది. బిగ్ బాస్‌కి వెళ్లి వచ్చిన తర్వాత కూడా పలు ప్రైవేట్ సాంగ్స్ చేశాడు భోలే.

Please follow and like us:
వార్తలు సినిమా సినిమా వార్తలు