పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం అనేది చాలా మందిని వేధించే సమస్య. ఇది శరీరాన్ని లావుగా చూపించడమే కాకుండా.. ఆరోగ్యానికి కూడా ప్రమాదం. అయితే ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొన్ని సహజ పదార్థాలతో కలిపి తయారు చేసిన డిటాక్స్ వాటర్ తాగితే.. ఈ సమస్యను నెమ్మదిగా తగ్గించుకోవచ్చు. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో చాలా సహాయపడుతుంది.
ఈ ప్రత్యేకమైన డ్రింక్ కోసం అవసరమయ్యే పదార్థాలు మన ఇంట్లో సులభంగా దొరికేవే. జీలకర్ర, వాము, సోంపు, నిమ్మరసం, గోరువెచ్చటి నీరు. ఈ పదార్థాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవన్నీ కలిసి తీసుకుంటే శరీరంలో గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ ను కూడా తగ్గించడంలో సహాయపడతాయి.
ఈ డ్రింక్ లో ఉండే జీలకర్ర, వాము, సోంపు వంటి పదార్థాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇవి శరీరంలో యాసిడ్ స్థాయిని సరిచేయడమే కాకుండా.. ఆహారం తేలికగా జీర్ణం అయ్యేలా చేస్తాయి. దీని వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి.
ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో ఈ గోరువెచ్చటి నీటిని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు నెమ్మదిగా కరిగిపోతుంది. ముఖ్యంగా కడుపు భాగం చుట్టూ పేరుకుపోయిన మొండి కొవ్వును కరిగించడంలో ఇది సహాయపడుతుంది. దీని వల్ల బరువు తగ్గే ప్రక్రియ వేగవంతం అవుతుంది.
ఈ గోరువెచ్చటి నీటిలో ఉండే సహజ పదార్థాలు శరీరాన్ని డిటాక్స్ చేయడంలో కూడా సహాయపడతాయి. అవి కాలేయాన్ని శుభ్రపరచడంలో తోడ్పడతాయి. దీని వల్ల శరీరంలోని విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోజూ దీనిని తాగడం వల్ల శరీరం తేలికగా, చురుకుగా అనిపిస్తుంది.
రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీటిలో ఒక్కో టీ స్పూన్ జీలకర్ర, వాము, సోంపు వేసి నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని కొద్దిగా వేడి చేసి అందులో అర నిమ్మకాయ రసం కలిపి ఖాళీ కడుపుతో తాగాలి. ఇదే విధంగా ప్రతిరోజూ తాగితే మంచి ఫలితాలను పొందవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)