అర్ధరాత్రి అదేపనిగా కుక్కల అరుపులు.. ఏంటా అని టార్చ్ వేసి చూడగా

అర్ధరాత్రి అదేపనిగా కుక్కల అరుపులు.. ఏంటా అని టార్చ్ వేసి చూడగా

రాత్రిపూట బయటకు వెళ్లాలంటే జనం జంకుతున్నారు. ఎలుగుబంటి రోడ్డుపై సంచరిస్తుంది. గత కొన్నిరోజులుగా ఇదే ప్రాంతంలో ఎలుగుబంటి తిరుగుతుంది. స్థానికులు ఒంటరిగా వెళ్లకుండా గుంపులు గుంపులుగా వెళ్తున్నారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి.

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై రాత్రి వేళల్లో ఎలుగుబంటి సంచరించడం కలకలం రేపింది. సమ్మక్క గుట్ట వద్ద ఉన్న పెట్రోల్ పంపు యజమాని ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో ఎలుగుబంటి సంచరించిన వీడియోలు రికార్డు అయ్యాయి. అంతే కాకుండా స్థానికులకు కూడా ఎలుగు బంటి కనబడింది. దీంతో ఈ ప్రాంత ప్రజలకు భయం పుట్టిస్తోంది. జాగిరిపల్లి గ్రామంలో క్వారీ ఉండటంతో అక్కడ ఉన్న ఎలుగు బంటి జనంలోకి వస్తుంది. ఒక్కటే కాకుండా మరో రెండు ఎలుగు బంటిలు కూడా ఉన్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు భయపడుతున్నారు. ఇప్పటికైనా అటవిశాఖ అధికారులు స్పందించి ఎలుగుబంటిని పట్టుకోవాలని అటవీ ప్రాంతం లో వదిలి పెట్టాలని కోరుతున్నారు

Please follow and like us:
తెలంగాణ వార్తలు