బత్తుల శ్రీనివాసరావును పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా శ్రీనివాసరావుపై పోలీసులు దృష్టి పెట్టారు. పక్కా ఆధారాలు సేకరించిన వెంటనే అరెస్ట్ చేశారు. శ్రీనివాసరావు తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలోని మట్టపల్లికి చెందిన వ్యక్తి.. గత కొన్ని రోజులుగా చిలకలూరిపేటలో నివసిస్తూ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు
పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన బత్తుల శ్రీనివాసరావును పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా శ్రీనివాసరావుపై పోలీసులు దృష్టి పెట్టారు. పక్కా ఆధారాలు సేకరించిన వెంటనే అరెస్ట్ చేశారు. శ్రీనివాసరావు తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలోని మట్టపల్లికి చెందిన వ్యక్తి.. గత కొన్ని రోజులుగా చిలకలూరిపేటలో నివసిస్తూ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఏకంగా డిఎస్పీనని చెప్పుకుంటూ అమాయకులైన మహిళల వద్ద నుండి ఉద్యోగాల పేరుతో డబ్బులు గుంజుతున్నాడు.
చిలకలూరిపేటలోని సుగాలీ కాలనీకి చెందిన భూలక్ష్మీకి… శ్రీనివాసరావు పరిచయం అయ్యాడు. తాను డిఎస్పీగా పనిచేస్తున్నానని చెప్పుకున్నాడు. డబ్బులిస్తే పోలీస్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. దీంతో భూలక్ష్మీ అతని మాటలు నమ్మింది. ఐదు లక్షల రూపాయలకు ఇద్దరి మధ్య అగ్రిమెట్ కుదిరింది. మొదటగా ముప్పై వేల రూపాయల ఇవ్వాలని శ్రీనివాసరావు అడిగాడు. భూలక్ష్మీ డబ్బులు ఇచ్చింది. ఆ తర్వాత ఆమెను తీసుకొని గుంటూరు కలెక్టరేట్ కు వచ్చాడు. కలెక్టరేట్ బయట భూలక్స్మీని ఉంచి తాను లోపలకి వెళ్లాడు. బయటకు వస్తూనే పోలీస్ డ్రెస్, లాఠీ, టోపి తీసుకొచ్చి భూలక్ష్మీకి ఇచ్చాడు. నీ కొడుక్కి పోలీస్ ఉద్యోగం వచ్చినట్టే అని చెప్పాడు. అతని మాటలు నమ్మిన భూ లక్ష్మీ డ్రెస్, లాఠీ, టోపి తీసుకొని ఇంటికి వెళ్లింది. తన కొడుక్కి ఉద్యోగం వచ్చినట్లు చెప్పుకుంది. వెంటనే అనుమానం వచ్చిన చుట్టుపక్కల వాళ్లు పోలీస్ ఉద్యోగం అలా ఇవ్వరని చెప్పారు. దీంతో ఆమె మోస పోయినట్లు తెలుసుకొని పోలీసులను ఆశ్రయించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు శ్రీనివాసరావుపై నిఘా పెట్టారు.
శ్రీనివాసరావును పట్టకున్న పోలీసలు అతని వద్ద నుండి పోలీస్ డ్రెస్, లోపి, లాఠీ, బ్యాడ్జిని స్వాధీనం చేసుకున్నారు. అయితే శ్రీనివాసరావుపై రాజమండ్రి, మార్కాపురం, మేడికొండూరు, త్రిపురాంతకం, నర్సరావుపేట స్టేషన్లలోనూ కేసులున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో అతని మోసాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.