బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్‌ ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.లక్షకుపైగా జీతం

బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్‌ ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.లక్షకుపైగా జీతం

బ్యాంక్ ఆఫ్‌ బరోడా.. దేశ వ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుత నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 50 మేనేజర్‌ (క్రెడిట్‌ అనలిస్ట్‌), సీనియర్‌ మేనేజర్‌(క్రెడిట్ అనలిస్ట్‌), చీఫ్‌ మేనేజర్‌(క్రెడిట్ అనలిస్ట్‌), సీనియర్ మేనేజర్‌ సీ & ఐసీ రిలేషన్‌షిప్‌మేనేజర్‌, చీఫ్‌ మేనేజర్‌ సీ & ఐసీ రిలేషన్‌షిప్‌మేనేజర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్‌ 30, 2025వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

పోస్టుల వివరాలు..
మేనేజర్‌ (క్రెడిట్‌ అనలిస్ట్‌) పోస్టుల సంఖ్య: 1
సీనియర్‌ మేనేజర్‌(క్రెడిట్ అనలిస్ట్‌) పోస్టుల సంఖ్య: 25
చీఫ్‌ మేనేజర్‌(క్రెడిట్ అనలిస్ట్‌) పోస్టుల సంఖ్య: 2
సీనియర్ మేనేజర్‌ సీ & ఐసీ రిలేషన్‌షిప్‌మేనేజర్‌ పోస్టుల సంఖ్య: 16
చీఫ్‌ మేనేజర్‌ సీ & ఐసీ రిలేషన్‌షిప్‌మేనేజర్ పోస్టుల సంఖ్య‌: 6
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ, సీఏ, సీఎంఏ, సీఎస్‌, సీఎఫ్‌ఏ, డిప్లొమా, పీజీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత పని అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల గరిష్ఠ వయోపరిమితి 25 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో తుది గడువులోగా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్‌ఎం, డీఈఎస్‌ఎం, మహిళా అభ్యర్థులు రూ.175 చొప్పున రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేదా గ్రూప్‌ డిస్‌కషన్‌, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు మేనేజర్‌ పోస్టులకు రూ.64,820 నుంచి రూ.93,960 వరకు, సీనియర్ మేనేజర్‌ పోస్టులకు రూ.85,920 నుంచి రూ.1,05,280 వరకు, చీఫ్ మేనేజర్‌ పోస్టులకు రూ.1,02,300 నుంచి రూ.1,20,940 వరకు జీతంగా చెల్లిస్తారు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు