గతేడాది కంటే రూ.4లక్షల 99వేలు అధికంగా పలికిన లడ్డూ ధర ఈ యేడు రికార్డును తిరగరాసింది. బాలాపూర్ బొడ్రాయి దగ్గర జరిగిన వేలం పాట నిర్వహణ మొదటి నుంచి ఎంతో ఉత్సహంగా సాగింది. లడ్డూ వేలం పాటలో 38 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ప్రతి ఏటా పెరుగుతున్న లడ్డూ వేలం పాట ఈ యేడు 4లక్షల 99వేలు అధికంగా పలికింది. బాలాపూర్ గణేష్ లడ్డూకు రికార్డు ధర పలికింది.
భాగ్యనగరంలో అందరి దృష్టిని ఆకర్షించే బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలంపాట పూర్తైంది. గతేడాది కంటే రూ.4లక్షల 99వేలు అధికంగా పలికిన లడ్డూ వేలం పాట ఈ యేడు రికార్డు సృష్టించింది.. ఏకంగా రూ.35 లక్షలు పలికింది. కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ గౌడ్ అనే వ్యక్తి రూ.35 లక్షలకు స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. బాలాపూర్ లంబోదరుడి చేతిలో నవరాత్రులు పూజలందుకున్న లడ్డు వేలం పాటతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది. అందుకే గణేశుడి లడ్డూ వేలం పాట కోసం సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు భక్తులు.
ఈ సంవత్సరం కూడా బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలం అత్యంత ఉత్సహంగా , ఉత్కంఠభరితంగా సాగింది. లడ్డూ వేలం పాటలో పాల్గొనేందుకు 38 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. స్థానికులు, స్థానికేతరుల మధ్య జరిగే ఈ వేలంపాటలో నువ్వా నేనా అన్నట్లుగా వేలం పాట జరుగుతుంది. ప్రతి ఏటా పెరుగుతున్న లడ్డూ వేలం రూ.35 లక్షలు పలికింది. కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ్‌గౌడ్ ను ఈ సారి అదృష్టం వరించింది. గత ఏడాది 30 లక్షల వెయ్యి రూపాయలకు వేలంలో దక్కించుకున్నారు కొలన్ శంకర్‌రెడ్డి.
1994లో 450 రూపాయలతో మొదలైన లడ్డూ వేలం పాట ఇక్కడ ఒక సంప్రదాయంగా మారింది. ఇక్కడ మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడ లడ్డూ వేలంపాట ద్వారా వచ్చే నగదును గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేస్తుంది ఉత్సవ సమితి. ఇప్పటి వరకు కోటి 64 లక్షల 87 వేల 970లు ఖర్చు చేసినట్లు ఉత్సవ సమితి సభ్యులు చెబుతున్నారు.
ప్రతి సంవత్సరంలానే ఈ ఏడాది కూడా బాలాపూర్ లడ్డూ వేలం పాట జరిగింది. పార్టీలకు అతీతంగా ఇక్కడ వినాయక ఉత్సవాలు , లడ్డూ వేలం పాట నిర్వహిస్తున్నారు. ఈ యేడు వేలం పాటకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలాపూర్‌లో పుట్టిన వాళ్లంతా అదృష్టవంతులేనని అన్నారు. బాలాపూర్ గణనాథుడు కొలువుదీరిన ఈ మహేశ్వరం నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవ్వడం తన అదృష్టం అన్నారు సబితా.