ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్’ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సింపుల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించేందుకు మార్గదర్శకాలను రూపొందించింది. ఇందులో భాగంగానే ఈనెల 10 నుంచి సచివాలయానికి వాటర్ బాటిళ్ల ప్రవేశాన్ని నిషేధిస్తుంది. వాటి స్థానంలో రీయూజబుల్ స్టీల్ బాటిల్స్‌ను ప్రభుత్వమే అందజేయనుంది.
ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్’ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సింపుల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించేందుకు మార్గదర్శకాలను రూపొందించింది. మొదటగా ఆంధ్రప్రదేశ్ పరిపాలన కేంద్రం రాష్ట్ర సచివాలయం నుంచే దీనికి తొలి అడుగుపడాలని నిర్ణయించింది. ఆ దిశగా కార్యాచరణను ప్రకటించింది. ఈనెల 10 నుంచి సచివాలయానికి వాటర్ బాటిళ్ల ప్రవేశాన్ని నిషేధిస్తుంది. బయట నుంచి వచ్చే వాహనాలను కూడా పూర్తిస్థాయిలో స్క్రీన్ చేసి వాటర్ బాటిల్ ఉంటే సెక్యూరిటీ సిబ్బంది వాటిని తీసేసుకుంటారు. వాటి స్థానంలో సచివాలయంలో ప్రతి ఉద్యోగికి ఒక రీ యూజబుల్ స్టీల్ వాటర్ బాటిల్ ని ప్రభుత్వమే ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే క్యాంటీన్ తో పాటు అన్ని ప్రాంతాల్లో ఈ స్టీల్ బాటిల్‌ని ఉంచబోతున్నారు. ఆగస్టు 15 నుంచి పూర్తిస్థాయిలో సచివాలయంలో ప్లాస్టిక్ బాటిల్ నిషేధం అమలు కాబోతోంది.
ప్లాస్టిక్‌కు అలవాటు.. కానీ ప్రత్యామాయం తప్పదు
ప్రజలు ప్లాస్టిక్ వాడకానికి బాగా అలవాటుపడిపోయారు. చిన్న దుకాణాల నుంచీ, ఆఫీస్‌ల వరకూ ప్లాస్టిక్ లేనిదే పని జరగదన్న స్థితి. అయినా, దాని పర్యావరణ ప్రభావం దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు క్రమంగా నిషేధించాలనే నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఒక్కసారిగా ఆపేయడమే కాదు. ప్రతీసారీ ప్రత్యామాయం చూపిస్తూ అలవాట్లను మార్చే ప్రయత్నం మొదలవుతోంది. ఈ ప్రక్రియ రాష్ట్ర సచివాలయం నుంచే మొదలుకానుంది.
సచివాలయం నుంచే మొదటి అడుగు
ఈ ఆగస్టు 10 నుంచి ఏపీ సచివాలయంలో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లపై నిషేధం అమలులోకి రానుంది. ఆగస్టు 15 నుంచి సింపుల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించనున్నారు. వచ్చే ఏడాది జూన్ 5న పర్యావరణ దినోత్సవ సమయానికి ప్లాస్టిక్ లేని సచివాలయం, ప్లాస్టిక్ లేని రాష్ట్రం లక్ష్యంగా నిర్ణయం ఈ తీసుకున్నట్టు అధికారులు వివరించారు. ఉద్యోగులందరికీ స్టీల్ వాటర్ బాటిళ్లు పంపిణీ చేయనున్నారు. డిపార్ట్మెంట్స్ అంతటా రీయూజబుల్ బాటిళ్లు అందుబాటులో ఉంచుతారు. విజిటర్లు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో భద్రతా పరిశీలనలతోపాటు RO ప్లాంట్ల ఏర్పాటు మీద దృష్టి పెట్టనున్నారు. బయట నుంచి నీళ్ల బాటిళ్లు తీసుకురావడాన్ని పూర్తిగా నియంత్రించనున్నారు. కట్టుదిట్టమైన స్క్రీనింగ్ అమలవుతుంది.
ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా ఉద్యమం కావాలి
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ “ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమాలు నడుస్తున్నాయి. మన రాష్ట్రం ఆ దిశగా ముందడుగు వేస్తోంది. ప్లాస్టిక్ వల్ల జరిగే హాని అందరికీ అర్థమైంది. ప్రజలు మార్పు వైపు అడుగుపెట్టు తీరాల్సిందే. ప్రత్యామాయాలు చూపిస్తే వారూ సహకరిస్తారు. వచ్చే సంవత్సరం పర్యావరణ దినోత్సవానికి ‘ప్లాస్టిక్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్’ని లక్ష్యంగా పెట్టుకున్నాం” అని తెలిపారు. ఇప్పటికే ఈ ఏడాది జనవరి నుంచి ప్రతి మూడో శనివారం ‘స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం జరుగుతోందని తెలిపారు. ఇదే తాత్త్వికతతో ప్లాస్టిక్ నిషేధానికి జాగ్రత్తలు ప్రారంభించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.