గీత దాటితే వేటు తప్పదు.. సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం..!

గీత దాటితే వేటు తప్పదు.. సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం..!

సోషల్ మీడియాలో విచ్చలవిడిగా జరుగుతున్న దుష్ప్రచారంపై ఉక్కుపాదం మోపేందుకు సన్నద్ధమవుతోంది ఏపీ ప్రభుత్వం. ఇందుకోసం కఠిన చట్టాలు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఆ మేరకు ఇప్పటికే కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మంత్రి మండలి సమావేశంలో కూడా ఈ అంశంపై ప్రధానంగా చర్చించింది.

ఫేక్ పోస్ట్‌లు, అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తప్పుడు ప్రచారంపై ప్రత్యర్థి పార్టీకి హెచ్చరికలు జారీ చేసిన ముఖ్యమంత్రి.. ఈ అంశంపై కేబినెట్‌ భేటీలో కూడా చర్చించారు. సోషల్ మీడియా పోస్టులకు ఆధార్ అకౌంటబిలిటీ ఉండేలా చట్టం ఉండాలనే అంశంపై చర్చించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎవరు పడితే వాళ్లు విచ్చలవిడిగా పోస్టులు పెడుతున్నారు. వీటిలో ఏది నిజమో, ఏది అబద్దమో అర్థం కాని పరిస్థితి ఉంది. అందుకే సోషల్ మీడియాలో అసత్య పోస్టులు పెట్టే వాళ్లపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఎంతో కాలంగా వినిపిస్తోంది. దీంతో సోషల్ మీడియా పోస్టులను ఇకపై పూర్తిగా రివ్యూ చేయాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఎవరైనా అసత్య ప్రచారం చేస్తున్నా, వ్యక్తిగత విమర్శలకు దిగినా, అలాంటి వాళ్లపై కఠిన చర్యలు తీసుకునే అధికారాన్ని పోలీసులకు కట్టబెడుతూ చట్టం తీసుకొచ్చే ఆలోచనలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది.

ఏపీలోని కొన్ని జిల్లాల్లో పోలీసులు సోషల్ మీడియా పోస్టులపై ఇప్పటికే ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏవైనా పోస్టులు పెడితే వాటికి ఆధారాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఆధారాలు సమర్పించకపోతే ఆయా పోస్టులను బట్టి వాళ్లపై చర్యలు తీసుకుంటున్నారు. అయితే సోషల్ మీడియా అకౌంట్లను ఆధార్ లాంటి వాటితో అనుసంధానం చేయడం ద్వారా ఫేక్ అకౌంట్లకు చెక్ పెట్టవచ్చని ఏపీ ప్రభుత్వ ఆలోచిస్తున్నట్టు సమాచారం. మరోవైపు సోషల్‌మీడియా పోస్టులపై చర్యల కోసం ఇప్పటికే కేబినెట్‌ సబ్‌ కమిటీని కూడా ఏర్పాటు చేసింది చంద్రబాబు ప్రభుత్వం.

యూరియాపై జరుగుతున్న దుష్ప్రచారంపై కూడా కేబినెట్‌లో మంత్రులతో చర్చించారు సీఎం చంద్రబాబు. రాష్ట్రవ్యాప్తంగా ఎరువులకు ఇబ్బంది లేకపోయినా కూడా వైసీపీ దుష్ప్రచారం చేస్తోందన్న ముఖ్యమంత్రి..ఆ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడంలో మంత్రులు, పార్టీ నేతలు విఫలమవుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకనుంచి ఇలాంటి దుష్ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు