ఏపీలో AI విప్లవం.. హైస్కూలు స్థాయి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశాలు: నారా లోకేష్

ఏపీలో AI విప్లవం.. హైస్కూలు స్థాయి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశాలు: నారా లోకేష్

భారతదేశంలో విద్యారంగ సంస్కరణల్లో ఆంధ్రప్రదేశ్ ముందువరుసలో ఉందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. విద్యారంగంపై క్వీన్స్ ల్యాండ్ ట్రేడ్ & ఇన్వెస్టిమెంట్ సెంటర్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ఆస్ట్రేలియా (బ్రిస్బేన్): భారతదేశంలో విద్యారంగ సంస్కరణల్లో ఆంధ్రప్రదేశ్ ముందువరుసలో ఉందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. విద్యారంగంపై క్వీన్స్ ల్యాండ్ ట్రేడ్ & ఇన్వెస్టిమెంట్ సెంటర్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంతర్జాతీయంగా అధునాతన సాంకేతికతలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ లో హైస్కూలు స్థాయి నుంచే ఏఐ పాఠ్యాంశాలను ప్రవేశపెడుతున్నట్లు నారా లోకేష్ పేర్కొన్నారు. ఉన్నత పాఠశాలల్లో ఏఐ ల్యాబ్‌లు, స్టెమ్‌, రోబోటిక్స్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నామని.. మున్ముందు మరిన్ని సదుపాయాలను కల్పిస్తామని చెప్పారు. ఏఐ విప్లవం ద్వారా వచ్చే అవకాశాలను ఏపీలోని యువత అందుకునేందుకు ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు అనుగుణంగా ఏపీలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. గవర్నెన్స్ లో ఏఐ వినియోగం ద్వారా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. ఏఐ ద్వారా విద్య, వైద్యం, ఆరోగ్య రంగాల్లో మెరుగైన సేవలు అందించేందుకు కృషిచేస్తున్నట్లు నారా లోకేష్ చెప్పారు.

ఈ సమావేశంలో భారత కాన్సులేట్ జనరల్ (బ్రిస్బేన్) నీతూ భాగోటియా, క్వీన్స్ ల్యాండ్ యూనివర్సిటీ డిప్యూటీ వైస్ ఛాన్స్ లర్ మార్క్ హార్వే, క్వీన్స్ ల్యాండ్ గ్లోబల్ ఇన్వెస్టిమెంట్ కమిషనర్ మిచైల్ మాథ్యూస్, డైరెక్టర్ ఇంటర్నేషనల్ మార్కెట్ గార్బియేల్ ట్రూన్, స్టడీ క్వీన్ ల్యాండ్ అడిషనల్ డైరెక్టర్ స్టెఫానీ హంటర్, జేమ్స్ కుక్ యూనివర్సిటీ మెరైన్ బయోలజీ, ఆక్వాకల్చర్ ప్రొఫెసర్ క్యాల్ జెంజర్, యూనివర్సిటీ ఆఫ్ సదరన్ క్వీన్ ల్యాండ్ ప్రొ వైస్ ఛాన్స్ లర్ రెన్ యూ, సిక్యూ యూనివర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ (ఇంటర్నేషనల్ ఆపరేషన్స్) మీనూ ఇస్సార్, యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్ ల్యాండ్ సెంటర్ డైరెక్టర్ (క్వాంటమ్ సిస్టమ్స్) ఆండ్రూ రైట్, స్ట్రాటజీ మేనేజర్ శరవణన్, ఎడ్యుకేషన్ క్వీన్స్ ల్యాండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డంకెన్ మెక్ కెల్లర్ తదితరులు పాల్గొన్నారు.

కాగా.. ఏపీలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా.. మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు కంపెనీల ప్రతినిధులతో వరుసగా భేటీ అవుతున్నారు. అంతేకాకుండా.. సీఫుడ్ వ్యాపారం అంశంపై కూడా కీలక చర్చలు జరిపారు. భారతీయ సీఫుడ్ ఎగుమతిదారులకు అడ్డంకిగా ఉన్న ‘వైట్ స్పాట్ వైరస్’ కారణంగా ఆస్ట్రేలియాకు వలవని రొయ్యల ఎగుమతిపై ఆంక్షలు ఉండేవి. అయితే, రెండు దేశాల ప్రభుత్వాలు చేసిన విస్తృత కృషి ఫలితంగా, భారతీయ రొయ్యల దిగుమతికి తొలి ఆమోదం లభించింది.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు