కోస్తాంధ్ర తీరప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తెలంగాణలో నైరుతి రుతుపవనాల తిరోగమనం అయ్యాయి. దీని ప్రభావంతో అన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని.. గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు.
కోస్తా ఆంధ్ర తీరప్రాంతంలో సముద్ర మట్టం నుంచి 0.9 కిమీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. సోమవారం తెలంగాణలో నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమయ్యాయి. నిన్న ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్ వరకు నైరుతి రుతుపవనాలు ఉపసంహరించాయి. ఈరోజు తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణ చెందే అవకాశం ఉంది. ఈరోజ, రేపు తెలంగాణలోని అన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయంది. అన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ.
నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఏపీకి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా, రాయలసీమలో నాలుగు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయంది. ఇవాళ ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. నెల్లూరు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఈనెల 15-16 నాటికి నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్ర్కమించనున్నాయి. ఈశాన్య రుతుపవనాల రాకకు వాతావరణం అనుకూలంగా ఉందన్నారు.