బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది.. మరికొన్ని గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది.. రాగల 12 గంటల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి.. దక్షిణాంధ్ర సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది. ఏపీలో 14 జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్ జారీ చేయడంతోపాటు.. ప్రజలు జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది.
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది.. మరికొన్ని గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది.. రాగల 12 గంటల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి.. దక్షిణాంధ్ర సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది. ఏపీలో 14 జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్ జారీ చేయడంతోపాటు.. ప్రజలు జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది. ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, అనంతపురం, సత్యసాయి, కర్నూలు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్ జారీచేసింది.. ఆకస్మిక వదరలు వచ్చే అవకాశం ఉండటంతో.. అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు.
వాయుగుండం నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో 20 సెం.మీ కంటే అధిక వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. నిజాంపట్నం పోర్టులో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. ఏపీకి వారం రోజులపాటు వర్ష సూచన చేసిన వాతావరణ శాఖ.. దక్షిణకోస్తా, రాయలసీమకు భారీ నుంచి అతిభారీ అత్యంత భారీవర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.
తెలంగాణలో వాతావరణ సూచనలు..
ఇదిలాఉంటే.. తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయిని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అలర్ట్ జారీ చేసింది.