తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపించే సమయంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వారికి సూచించాలి. పిల్లలు రోడ్లపై పరిగెత్తకుండా, వర్షంలో తడవకుండా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ల సూచిస్తున్నారు. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పిల్లలు జ్వరాలు, జలుబులను నివారించవచ్చు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం సాయంత్రం తీరం దాటడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాత్రిపూట భారీ వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాలలో మంగళవారం కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని ఫలితంగా కొన్ని జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు అధికారులు.
ఇక ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నందున పరిస్థితులను బట్టి పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లోని కొన్ని పాఠశాలలకు కలెక్టర్లు సెలవులు ప్రకటించారు. అదనంగా విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లా, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. వర్షాలను సమీక్షించిన తర్వాత వర్షాలు ఇలాగే కొనసాగితే విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిఫార్సు చేశారు. అందుకే భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు సెలవులపై సమాచారం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే వర్షాప్రభావం కారణంగా అధికారులు అప్పటికప్పుడు సెలవులు ప్రకటిస్తారు. అందుకే తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండటం ముఖ్యం.
తెలంగాణలో..
ఇక తెలంగాణలోని సిద్దిపేట, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈరోజు సెలవులు ప్రకటించారు. కామారెడ్డి జిల్లాలోని దొంగడ్లి, మద్నూర్ మండలాలకు కూడా సెలవులు ప్రకటించారు అధికారులు. భారీ వర్షాలు కొనసాగితే కలెక్టర్లు, విద్యా శాఖ అధికారులు సెలవులపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. అందువల్ల కొన్ని జిల్లాల్లో అధికారికంగా సెలవులు ప్రకటించకపోతే తల్లిదండ్రులు పాఠశాలలకు ఫోన్ చేసి ధృవీకరించుకోవాలి. వాట్సాప్ గ్రూప్ సందేశాల అప్‌డేట్‌ను తెలుసుకోవడం ముఖ్యం.
తెలంగాణలో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, హైదరాబాద్, వరంగల్, నల్గొండ, జగిత్యాల, రామగుండం, బెల్లంపల్లి, బాన్సువాడ, మెదక్, తుప్రాన్, మేడ్చల్, జనగాం, సూర్యాపేట, కొత్తగూడెంలలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో విద్యాసంస్థలకు ఎలాంటి సెలవులు లేవు.
ఏపీలో..
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, కోనసీమ, రాజమండ్రి, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, తుని, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, మన్యం, అరకులో ఈరోజు ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అందువల్ల ఈ ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ఉండవచ్చు.
జిల్లా కలెక్టర్లు సెలవులు ప్రకటించడానికి వెనుకాడుతున్నారు. ఎందుకంటే రానున్న రోజుల్లో పండగల సెలవులు ఉండటం వల్ల ఇప్పుడు కూడా సెలవులు ప్రకటిస్తే విద్యార్థుల చదువులకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని ఆలోచిస్తున్నారు. అతి భారీ వర్షం కురిసే ప్రాంతాల్లో తప్పకుండా సెలవు ప్రకటిస్తున్నారు అధికారులు. అయితే విద్యార్థుల చదువులకు అంతరాయం కలగకుండా పదే పదే సెలవులు ప్రకటించకూడదని కలెక్టర్లు భావిస్తున్నారు.
తల్లిదండ్రులకు కలెక్టర్ల సూచన:
తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపించే సమయంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వారికి సూచించాలి. పిల్లలు రోడ్లపై పరిగెత్తకుండా, వర్షంలో తడవకుండా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ల సూచిస్తున్నారు. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పిల్లలు జ్వరాలు, జలుబులను నివారించవచ్చు.