బీసీ రిజర్వేషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ.. తీర్పుపై ఉత్కంఠ..

బీసీ రిజర్వేషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ.. తీర్పుపై ఉత్కంఠ..

భారత్-పాక్‌ యుద్ధం ఒక్కటే కాదు… కేవలం తొమ్మిది నెలల్లోనే ఏడు యుద్దాలను ఆపిన ఘనత తనదే అంటూ సెల్ఫ్‌ డబ్బా కొట్టుకున్నారు ట్రంప్. గతంలో ఏ దేశ అధ్యక్షుడు, ప్రధాని ఇలాంటి పనిచేయలేదని తనకు తానే కితాబిచ్చుకున్నారు. యుద్దాలను ఆపడంలో ఐక్యరాజ్యసమితి ఘోరంగా విఫలమయ్యిందన్నారు. అంతేకాకుండా ఉక్రెయిన్‌ యుద్దం కొనసాగడానికి భారత్‌, చైనానే కారణమని పనిలో పనిగా నిందలు వేశారు.

జూబ్లీహిల్స్‌లో గెలుపు మాదే
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక కామెంట్స్ చేశారు కంటోన్మెంట్‌ ఉపఎన్నికలో వచ్చిన ఫలితమే జూబ్లీహిల్స్‌లో రిపీట్ అవుతుందన్నారు. బీఆర్ఎస్ ఇంకా అపోహల్లోనే బ్రతుకుతోందని ఎద్దేవా చేశారు. గత పదేళ్లలో జూబ్లీహిల్స్‌లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. అభ్యర్థి ఎంపిక పార్టీ హైకమండ్‌ చూసుకుంటుందన్నారు. ప్రజల ఆశీర్వాదంతో బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ అమలుచేసి తీరుతామని పొన్నం చెప్పారు.

సాయితేజ కేసులో ఐదుగురు అరెస్ట్
సిద్ధార్థ కాలేజీ స్టూడెంట్‌ సాయితేజ సూసైడ్‌ కేస్‌లో మేడ్చల్ పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. శివకుమార్, ప్రశాంత్, రోహిత్, మురళీధర్, సాయి ప్రసాద్‌ను రిమాండ్‌కు తరలించారు. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న సాయితేజ సీనియర్స్ ర్యాగింగ్ చేయడంతో మనస్థాపం చెంది ఈ నెల 21 ఆత్మహత్య చేసుకున్నాడు.

మరోసారి హైకోర్టుకు జగన్
ప్రతిపక్ష హోదాపై మరోసారి హైకోర్టును వైసీపీ అధినేత జగన్ ఆశ్రయించారు. స్పీకర్‌ రూలింగ్‌ కొట్టేయాలంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తన పిటిషన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉండగానే.. తన విజ్ఞప్తిని తిరస్కరిస్తూ స్పీకర్ రూలింగ్ ఇచ్చారని పిటిషన్‌లో జగన్ పేర్కొన్నారు. స్పీకర్ రూలింగ్‌ను చట్ట విరుద్ధమైనదిగా ప్రకటించడంతో పాటు తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలా స్పీకర్‌ను ఆదేశించాలని జగన్ కోరారు. ఈ పిటిషన్‌పై ఇవాళ ఏపీ హైకోర్టు విచారించనుంది.

బీసీ రిజర్వేషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ..
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించడంపై దాఖలైన పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదనే రాజ్యాంగ నియమాన్ని ప్రభుత్వం ఉల్లంఘించిందని పిటిషనర్లు ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయం చట్ట విరుద్ధమని, పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాలని వారు కోర్టును అభ్యర్థించారు.

ట్రంప్‌ దంపతులు ఎక్కగానే ఆగిన ఎస్కలేటర్‌..
ఐక్యరాజ్యసమితి సమావేశాలకు హాజరైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,‌ ఆయన సతీమణి మెలానియాకు ఊహించని సంఘటన ఎదురైంది. సమావేశ వేదిక వద్దకు వెళ్లేందుకు వారు ఎక్కిన ఎస్కలేటర్‌ సడెన్‌గా ఆగిపోవడంతో ట్రంప్‌ దంపతులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ ఘటనను వైట్‌హౌస్‌ తీవ్రమైన భద్రతా వైఫల్యంగా పరిగణించి, దీనిపై దర్యాప్తునకు ఆదేశించింది.

విజయవాడలో మహిళపై కత్తితో దాడి
విజయవాడ భవానిపురంలో అర్ధరాత్రి మహిళపై హత్యాయత్నం కలకలం రేపింది. అప్పారావు అనే వ్యక్తి కత్తితో లక్ష్మీ అనే మహిళ గొంతు కోశాడు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే దాడిచేసినట్టు పోలీసులు నిర్ధారించారు. మద్యం మత్తులో ఈ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో మహిళకు తీవ్ర గాయాలు అవ్వగా.. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.

ఒంగోలులో భూ ప్రకంపనలు
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భూ ప్రకంపనలు సంభవించాయి. ఒంగోలు నగరంలో స్వల్పంగా భూమి కంపించడంతో స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో ఈ భూ ప్రకంపనలు సంభవించాయి. దాదాపు రెండు సెకన్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా ఒంగోలులోని సీఎస్ఆర్ శర్మ కాలేజీ ప్రాంతంలో ప్రకంపనల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. అయితే ఈ భూ ప్రకంపనల కారణంగా ఎటువంటి ఆస్తి నష్టం లేదా ప్రాణనష్టం జరగలేదు

ఈ నెల 26, 27న తెలంగాణలో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడనున్న వాయుగుండం కారణంగా ఈ నెల 26, 27 తేదీల్లో తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నెల 25న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, 26వ తేదీ నాటికి అది వాయుగుండంగా బలపడనుంది. ఈ వాయుగుండం 27న దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉంది. దీన్ని ప్రభావంతో 26న ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.

నొబెల్ ప్రైజ్‌ ఇవ్వాలంటున్న ట్రంప్
భారత్-పాక్‌ యుద్ధం ఒక్కటే కాదు… కేవలం తొమ్మిది నెలల్లోనే ఏడు యుద్దాలను ఆపిన ఘనత తనదే అంటూ సెల్ఫ్‌ డబ్బా కొట్టుకున్నారు ట్రంప్. గతంలో ఏ దేశ అధ్యక్షుడు, ప్రధాని ఇలాంటి పనిచేయలేదని తనకు తానే కితాబిచ్చుకున్నారు. ఐక్యరాజ్యసమితి చేయాల్సిన పనులు తాను చేస్తునట్టు తెలిపారు

సెల్ఫ్‌ డబ్బా కొట్టుకోవడంలో అమెరికా అధ్యక్షలవారి తర్వాతే ఎవ్వరైనా.. ఇప్పటికే తిక్కతిక్క నిర్ణయాలతో ప్రపంచానికే గత్తరలేపుతున్న ట్రంపుసారు.. మరోసారి సొంత డబ్బు కొట్టుకున్నారు. ఐక్యరాజ్యసమితి వేదికపైనే తానో ధీరుడు, సూరుడు, ప్రపంచశాంతి ధూతను అంటూ తెగ బిల్డప్‌ ఇచ్చుకున్నారు. ఇంతా చేస్తున్నా నోబెల్‌ బహుమతి ఇవ్వరా.. అంటూ రివర్స్‌ క్వశ్యన్‌ వేశారు ట్రంప్.యుద్ధాలెన్నో ఆపానంటారు.. అందరి సంగతీ తేలుస్తానంటారు.. ప్రపంచంలో ఎవరూ చేయలేనివెన్నో చేశానంటూ తనకు తానే వీరతాడు వేసుకుంటారు డొనాల్డ్ ట్రంప్. తన వ్యవహారశైలితో సెటైర్లకీ సెంటర్‌ పాయింటవుతున్న ట్రంప్.. ఐక్యరాజ్యసమితి వేదికగా పిచ్చి ప్రేలాపనలు చేసి మరోసారి హాట్‌టాపిక్‌గా మారారు. భారత్‌-పాకిస్తాన్‌ యుద్దాన్ని తానే ఆపినట్టు అక్కడా మరోసారి డబ్బాకొట్టుకున్నారు.

భారత్-పాక్‌ యుద్ధం ఒక్కటే కాదు… కేవలం తొమ్మిది నెలల్లోనే ఏడు యుద్దాలను ఆపిన ఘనత తనదే అంటూ సెల్ఫ్‌ డబ్బా కొట్టుకున్నారు ట్రంప్. గతంలో ఏ దేశ అధ్యక్షుడు, ప్రధాని ఇలాంటి పనిచేయలేదని తనకు తానే కితాబిచ్చుకున్నారు. ఐక్యరాజ్యసమితి చేయాల్సిన పనులు తాను చేస్తునట్టు తెలిపారు. యుద్దాలను ఆపడంలో ఐక్యరాజ్యసమితి ఘోరంగా విఫలమయ్యిందన్నారు. అంతేకాకుండా ఉక్రెయిన్‌ యుద్దం కొనసాగడానికి భారత్‌, చైనానే కారణమని పనిలో పనిగా నిందలు వేశారు. రష్యాకు ఈ రెండు దేశాలు పూర్తిగా సహకరిస్తున్నాయన్నారు.

మొత్తంగా… నోబెల్‌ బహుమతి కావాలనడం… భారత్‌ను మరోసారి ట్రంప్‌ ఇలా టార్గెట్‌ చేయడం చర్చనీయాంశమైంది. మొదట సుంకాల బాంబ్‌ పేల్చిన ట్రంప్‌ తరువాత హెచ్‌1 బీ వీసాల ఫీజును పెంచి భారతీయులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేశారు. ఫైనల్‌గా అంతా అమెరికా, అమెరికా పౌరుల కోసమే చేస్తున్నానని తన తీరును సమర్ధించుకోవడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు