అటు ఎండలు.. ఇటు వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్

అటు ఎండలు.. ఇటు వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది.. పగటి వేళ ఎండలు మండిపోతుంటే.. సాయంత్రం వేళ వర్షాలు కురుస్తున్నాయి.. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది.. పగటి వేళ ఎండలు మండిపోతుంటే.. సాయంత్రం వేళ వర్షాలు కురుస్తున్నాయి.. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈదురు గాలులు పిడుగులతో.. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం..

  1. నిన్నటి, ద్రోణి/గాలి అంతరాయం ఈ రోజు, తూర్పు ఉత్తరప్రదేశ్‌పై ఉన్న ఉపరితల ఆవర్తనము నుండి, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, మరాఠ్వాడ, అంతర కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నది.
  2. కోస్తా ఆంధ్రప్రదేశ్ – దానిని ఆనుకుని ఉన్న తెలంగాణపై ఒక ఉపరితల ఆవర్తనము సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నది.
  3. కొమొరిన్ ప్రాంతం నుండి ఉత్తర అంతర కర్ణాటక వరకు ఉన్న నిన్నటి తూర్పు గాలుల ద్రోణి ఈ రోజు బలహీనపడినది./ తక్కువగా గుర్తించబడినది.

4.ఆంధ్రప్రదేశ్ – యానాంపై దిగువ ట్రోపో ఆవరణములో దక్షిణ /ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయి.

వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం :-
మంగళవారం, బుధవారం, గురువారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
మంగళవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30- 40 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి.

బుధవారం, గురువారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది.

రాయలసీమ :-
మంగళవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30- 40 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి.

బుధవారం, గురువారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది.

గమనిక :- కోస్తా ఆంధ్ర ప్రదేశ్ & యానాంలో రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు లో గణనీయమైన మార్పు లేదు. రాయలసీమ లో రాగల 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువగా ఒకటి లేదా రెండు చోట్ల నమోదు అయ్యే అవకాశముంది.ఆ తరువాత గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు లో గణనీయమైన మార్పు లేదు.

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ – వాతావరణ హెచ్చరికలు :
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. రాగల 3 రోజులకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి.

మంగళవారం తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. బుధవారం, గురువారం రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రానున్న మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది.

వాతావరణ హెచ్చరికలు
తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఈరోజు, రేపు ఉరుములు మెరుపులు – 40 నుండి 50 కి మీ వేగం కలిగిన ఈదురుగాలులు, వడగళ్ళతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు, 30 నుండి 40 కి.మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు