తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో మంగళవారం వెదర్ రిపోర్ట్..

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో మంగళవారం వెదర్ రిపోర్ట్..

తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో మళ్లీ చలి పులి పంజా మొదలైంది.. ఇటీవల కొంచెం పెరిగిన ఉష్ణోగ్రతలు మళ్లీ తగ్గుతున్నాయి.. అయితే.. చాలా జాల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. వాతావరణ శాఖ మళ్లీ అలర్ట్ జారీ చేసింది.. సోమవారం నుంచి వారం పాటు ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుందని పేర్కొంది.

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ చలి పంజా మొదలైంది.. ఇటీవల కొంచెం పెరిగిన ఉష్ణోగ్రతలు మళ్లీ తగ్గుతున్నాయి.. అయితే.. చాలా జాల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. వాతావరణ శాఖ మళ్లీ అలర్ట్ జారీ చేసింది.. సోమవారం నుంచి వారం పాటు ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ నాలుగైదు రోజులు ఆంధ్రప్రదేశ్ లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. కానీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు.. 2 నుండి 3 డిగ్రీలు తక్కువ నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంటున్నారు వాతావరణ అధికారులు..

తెలంగాణ వాతావరణ సూచనలు..
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. తెలంగాణలో వచ్చే వారం రోజుల పాటు రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని పేర్కొంది.. చలిగాలులు వీస్తాయని తెలిపింది. కోల్డ్‌వేవ్ పరిస్థితుల దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురుస్తుందని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని.. పగటి ఉష్ణోగ్రతలు కూడా 25-26 డిగ్రీల మధ్యనే నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిస్థితులు..
ఏపీలో సైతం చలి తీవ్రత పెరుగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దిగువ ట్రోపో ఆవరణములో కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం మరియు రాయలసీమలో ఈశాన్య మరియు తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు