రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్ధులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న పబ్లిక్ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 23) ఉదయం 10 గంటలకు విడుదలైనాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు. విద్యార్ధులు ఫలితాలను ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా నేరుగా చెక్ చేసుకోవచ్చు..
రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్ధులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 23) విడుదలైనాయి. బుధవారం ఉదయం 10 గంటలకు ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌తో పాటు టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌లోనూ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. అలాగే మనమిత్ర వాట్సాప్, లీప్ యాప్‌లోనూ విద్యార్థులు ఫలితాలు చూసుకోవచ్చు. అలాగే మన మిత్ర వాట్సప్ నంబర్ 9552300009కు ‘Hi’ అని మెసేజ్ చేసి, విద్యా సేవల ఆప్షన్ ఎంచుకున్న తర్వాత పదో తరగతి పరీక్షల ఫలితాల ఆప్షన్ వస్తుంది. అందులో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే చాలు.. ఫలితాలను పీడీఎఫ్ కాపీ రూపంలో క్షణాల్లో పొందవచ్చు.
ఇక తాజా ఫలితాల్లో ఎప్పటి మాదిరిగానే అమ్మాయిలు సత్తా చాటారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ అమ్మాయిలు అత్యధికంగా ఉత్తీర్ణత పొందారు. పదో తరగతి ఫలితాల్లో 81.14 శాతం మంది ఉత్తీర్ణత పొందారు. వీరిలో అబ్బాయిలు 78.31 శాతం, అమ్మాయిలు 84.09 శాతం ఉత్తీర్ణత పొందారు. 1680 స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత. 19 స్కూళ్లలో సున్నా శాతం ఉత్తీర్ణత. పార్వతీపురం మన్యం జిల్లాలో అత్యధికంగా 93.90 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 1680 స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత. 19 స్కూళ్లలో సున్నా శాతం ఉత్తీర్ణత. పార్వతీపురం మన్యం జిల్లాలో అత్యధికంగా 93.90 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా రాష్ట్రంలోనే అతి తక్కువ ఉత్తీర్ణత 47.64 శాతం నమోదు చేసింది. కాగా 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ఈ సారి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 6,19,275 మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంగ్లిష్ మీడియంకు సంబంధించి 5,64,064 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. తెలుగు మీడియంలో 51,069 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఏప్రిల్ 3 నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమవగా ఏప్రిల్ 9వ తేదీతో ముగిసింది. కేవలం ఏడు రోజుల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్ష మూల్యాంకనం ముగించి త్వరిత గతిన ఫలితాలను వెల్లడించారు.మరోవైపు రాష్ట్రంలోని ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ ఫలితాలను కూడా ఈ రోజు మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌లోనూ చెక్ చేసుకోవచ్చు. ఇక ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. సార్వత్రిక విద్యార్ధులు 30,334 మంది పరీక్షలు రాశారు.