సింగపూర్ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్ పలు కంపెనీల సీఈవోలతో భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా బుధవారం క్యాపిటాల్యాండ్ CEO సంజీవ్ దాస్ గుప్తాతో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రంలోని కీలకమైన పారిశ్రామిక కారిడార్‌లలో పారిశ్రామిక గిడ్డంగులు, పారిశ్రామిక పార్కుల ఏర్పాటు చేయాలని సంజీవ్ దాస్ గుప్తాను మంత్రి లోకేష్ కోరారు. దీనిపై స్పందించిన సంజయ్ గుప్తా రాష్ట్రంలో రూ.400కోట్లతో ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ పార్క్ ఏర్పాటుకు చేయాని భావిస్తున్నట్టు తెలిపారు.
సింగపూర్ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్ పలు కంపెనీల సీఈవోలతో భేటీ అవుతున్నారు. ఇందులో బుధవారం క్యాపిటాల్యాండ్ CEO సంజీవ్ దాస్ గుప్తాతో ఆయన భేటీ అయ్యారు.ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. CLI స్థిరమైన పెట్టుబడులకు ప్రాధాన్యతనిస్తున్నందున విశాఖలోని డేటా సెంటర్‌లను వారి క్యాప్టివ్ పవర్ ప్లాంట్ల ద్వారా పునరుత్పాదక శక్తితో పూర్తిగా శక్తివంతం చేయవచ్చని చెప్పారు. సాంప్రదాయ సాఫ్ట్‌వేర్ కంపెనీలు వైజాగ్ వంటి టైర్ 2 నగరాలకు తరలివస్తున్న నేపథ్యంలో వైజాగ్, విజయవాడలో IT సాఫ్ట్‌వేర్ పార్కులు, మిశ్రమ అభివృద్ధి నమూనాల ఏర్పాటును పరిశీలించాలని సూచించారు. రాష్ట్రంలోని కీలకమైన పారిశ్రామిక కారిడార్‌లలో పారిశ్రామిక గిడ్డంగులు పారిశ్రామిక పార్కుల ఏర్పాటు చేయాలని కోరారు.
మంత్రి విజ్ఞప్తిపై క్యాపిటా ల్యాండ్ సిఈఓ సంజీవ్ దాస్ గుప్తా స్పందిస్తూ.. ధీషన్ గ్లోబల్ స్పేసెస్‌తో కలిసి పనిచేస్తున్న క్యాపిటాలాండ్.. శ్రీ సిటీ సమీపంలో 400 కోట్ల రూపాయల పెట్టుబడితో ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ పార్క్‌ను స్థాపించాలని భావిస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా దాదాపు 5వేలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అన్నార GOMS.నం. 39, తేదీ. 25-03-2025లో పేర్కొన్న ప్రతిపాదిత భూసేకరణ నుండి మొత్తం 110 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న తమ భూమిని మినహాయించాలని కోరారు. APIIC ద్వారా శ్రీసిటీకి కేటాయింపు కోసం కొల్లాడం గ్రామంలో భూసేకరణకు ఇచ్చిన ప్రకటనలో సర్వే నంబర్లు 3 నుండి 153 వరకు తమ సంస్థ భూములు ఉన్నాయని తెలిపారు. APIIC అధికారులతో మాట్లాడి క్యాపిటాల్యాండ్ సమస్యను పరిష్కరిస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.