నవ్యాంధ్రకు మణిహారం.. మూడంటే మూడేళ్లలో మెరిసేటి రాజనగరం..!

నవ్యాంధ్రకు మణిహారం.. మూడంటే మూడేళ్లలో మెరిసేటి రాజనగరం..!

అమరావతి పునఃప్రారంభ కార్యక్రమం అత్యంత అట్టహాసంగా నిర్వహించింది ఏపీ ప్రభుత్వం. రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీని.. అమరావతి ప్రారంభోత్సవానికి కూడా పిలుస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ స్టేట్‌మెంట్‌తో జస్ట్‌ మూడేళ్లలోనే రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామనే క్లారిటీ వచ్చినట్టైంది. మోదీ ప్రసంగంతో భూములిచ్చిన రైతుల సందేహాలన్నీ తీరినట్టేనా? మోదీ ఇచ్చిన భరోసాతో చంద్రబాబు అనుకున్నది సాధించినట్టేనా? ఇంతకీ.. పునఃప్రారంభం అంటే ఏంటి?

రాజధాని అమరావతి విషయంలో రైతులు గానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గానీ ఏవైతే ఆశించారో.. అవే మాటలు వినిపించాయి ప్రధాని మోదీ నుంచి..! ‘కేవలం కాంక్రీట్‌ నిర్మాణాలు కావు.. ఏపీ ప్రగతికి, వికసిత్‌ భారత్‌కు బలమైన పునాదులు’ అంటూ రాజధాని అమరావతి గురించి ఒకే ఒక్క ముక్కలో తేల్చి చెప్పేశారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అమరావతి నిర్మాణానికి కేంద్రం అండగా ఉంటుందనే భరోసా ఇచ్చారు. ఆంధ్రుల రాజధాని అనే స్వప్నం త్వరలోనే సాకారం కాబోతోందన్న విషయం తన కళ్ల ముందు మెదులుతోందని చెప్పడంతో.. ఏపీ ప్రజలకు అమరావతిపై ఉన్న అనుమానాలన్నీ చెరిగిపోయినట్టే కనిపించాయి. అమరావతి పునఃప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది కూటమి ప్రభుత్వం. ముఖ్య అతిథిగా వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.. రాజధాని పనులు స్వయంగా పునః ప్రారంభించారు. అమరావతి 2.0 మొదలైందనడానికి గుర్తుగా అమరావతి పైలాన్‌ను ఆవిష్కరించారు. రాజధాని పనులు సహా 57వేల 940 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు.. వెలగపూడి సభ వేదికగా శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా.. అమరావతి నిర్మాణంపై ప్రశంసలు కురిపించారు. ఆంధ్రా యువత కలలను సాకారం చేసే రాజధానిగా అమరావతి ఎదుగుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు ప్రధాని. ఐటీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సహా అన్ని రంగాలకు అమరావతే గమ్యస్థానం అవుతుందని చెప్పుకొచ్చారు. ఇంద్రలోకంలో రాజధాని పేరు అమరావతి.. ఏపీ రాజధాని పేరు కూడా అమరావతే. ప్రధాని మోదీ ఇచ్చిన ఈ ఒక్క స్టేట్‌మెంట్‌తో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని…

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు