ICUలో అలేఖ్య చిట్టి.. అయ్యో ఇలా అవుతుంది అనుకోలేదు

ICUలో అలేఖ్య చిట్టి.. అయ్యో ఇలా అవుతుంది అనుకోలేదు

అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యవహారం ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది. కస్టమర్‌ను బయటకు చెప్పలేని రీతిలో భూతులు తిట్టి.. తీవ్ర నెగిటివిటీని మూటగట్టుకున్న చిట్టి.. ప్రస్తుతం ఆస్పత్రిలో చేరింది. ఆమెకు శ్వాస సరిగ్గా అందకపోవడంతో ఆస్పత్రిలో చేర్చినట్లు చిట్టి అక్క సుమి తెలిపారు.

ఇంత రేట్లు ఏంటి అని అడిగిన కస్టమర్‌ను పచ్చి భూతులు తిట్టి.. నెట్టింట దారుణ ట్రోలింగ్ ఎదుర్కొంటున్న అలేఖ్య చిట్టి ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఆమె ఆడియో అనూహ్య రీతిలో వైరల్ అవ్వడం.. ఇంటర్నెట్‌లో గత కొద్ది రోజులుగా భారీగా మీమ్స్, ట్రోల్స్ రావడంతో.. తను డిప్రెషన్‌కు గురైనట్లు తెలుస్తోంది. దీంతో నీరసించిపోయిన అలేఖ్య చిట్టిని కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చారు. తన చెల్లి సారీ చెప్పిన.. ట్రోల్స్ ఆపడం లేదని.. ఇప్పుడు ఆమె పరిస్థితి దారుణంగా తయారైందని అలేఖ్య అక్క సుమి వీడియో విడుదల చేసింది. అలేఖ్య బ్రీతింగ్ కూడా సరిగ్గా తీసుకోలేకపోతుందని.. కృత్రిమ ఆక్సిజన్ అందిస్తున్నట్లు తెలిపింది. తను చేసింది తప్పే అని.. సారీ అడిగింది కాబట్టి.. అందరూ యాక్సెప్ట్ చేయాలని సుమి కోరింది. తమ తండ్రి చనిపోయి మూడు నెలలేే అయిపోయిందని.. మరో బాధ తట్టుకునే శక్తి తమకు లేదని కన్నీళ్లు పెట్టుకుంది. పచ్చళ్ల బిజినెస్, యూట్యూబ్ ఏమి వద్దని.. అలేఖ్య చిట్టి సేఫ్‌గా ఉంటే చాలని తాము కోరుకుంటున్నట్లు సుమి తెలిపింది.

Please follow and like us:
వార్తలు సినిమా