అందాల భామ శ్రియ శరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు, తమిళంతోపాటు హిందీలోనూ తనదైన ముద్ర వేసింది. ఒకప్పుడు కుర్రాళ్ల ఫేవరేట్ హీరోయిన్ ఆమె. తక్కువ సమయంలోనే భారతీయ సినిమా ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన ఈ అమ్మడు ఇప్పటికీ సినిమాల్లో బిజీగా ఉంటుంది. తాజాగా ఈ అందాల భామ బ్యూటీ సీక్రెట్స్ గురించ బయటపెట్టింది
దక్షిణాది సినిమా ప్రపంచంలో ఒకప్పుడు చక్రం తిప్పిన హీరోయిన్లలో శ్రియ ఒకరు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలలో నటించి తనకంటూ మంచి పేరు తెచ్చుకుంది. అందం, అభినయంతోపాటు కథక్ డ్యాన్సర్ గానూ శ్రియ ఫేమస్. ఇప్పటికీ సినిమాల్లో బిజీగా దూసుకుపోతుంది.
ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోయిన శ్రియ.. ఇప్పుడు మాత్రం అవకాశం వస్తే ఎలాంటి పాత్రలోనైనా కనిపించేందుకు రెడీగా ఉంటుంది. ఇప్పుడు సహయ నటిగా రాణిస్తుంది. తెలుగు, తమిళం భాషలలో పలు చిత్రాల్లో నటించారు. దాదాపు రెండు దశాబ్దాలకుపైగా సినిమాల్లో నటిస్తున్నారు.
2018లో తన ప్రియుడు ఆండ్రీ కోస్కివ్ ను వివాహం చేసుకున్నారు శ్రియా. వీరికి రాధ అనే అమ్మాయి ఉంది. పెళ్లి తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న శ్రియ.. ఇప్పుడు తిరిగి సినిమాల్లో యాక్టివ్ అయ్యారు. కథానాయికగా కాకుండా పలు పాత్రలు పోషిస్తున్నారు.
ప్రస్తుతం శ్రియ వయసు 43 సంవత్సరాలు. ఇప్పటికీ గ్లామర్, బ్యూటీ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. ఇటీవల సూర్య నటించి రెట్రో చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది. అలాగే మిరాయ్ చిత్రంలో భూమిక పాత్రలో కనిపించారు. తాజాగా తన బ్యూటీ సీక్రెట్స్ విషయాలను బయటపెట్టారు.
ప్రతిరోజు వ్యాయామం చేయడం ముఖ్యమంటుంది. అలాగే ఆహారపు అలవాట్లు సైతం జాగ్ర్తత తీసుకుంటుందట. మంచిని వినడం, మంచిని చూడడం, మంచి చేయడం కూడా అందానికి రహస్యమే అంటుంది. యోగా, సైక్లింగ్, జిమ్ చేయడం కూడా ఫిట్నెస్ సీక్రెట్స్ అంటుంది.

