పాక్ నటుడికి సపోర్ట్‌గా ప్రకాశ్ రాజ్.. అబిర్ గులాల్ నిషేధంపై సంచలన కామెంట్స్.. నెటిజన్ల ఆగ్రహం

పాక్ నటుడికి సపోర్ట్‌గా ప్రకాశ్ రాజ్.. అబిర్ గులాల్ నిషేధంపై సంచలన కామెంట్స్.. నెటిజన్ల ఆగ్రహం

‘అబీర్ గులాల్’ సినిమాను నిషేధించడంపై టాలీవుడ్ నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన కామెంట్స్ చేశారు. పాకిస్తానీ యాక్టర్ ఫవాద్ ఖాన్‌ నటించిన ఈ సినిమా విడుదలను అడ్డుకోవడం సరికాదని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ప్రకాశ్ రాజ్ కామెంట్స్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

సినిమాలను నిషేధించే అంశంపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ సంచలన కామెంట్స్ చేశారు. ఒక సినిమాను నిషేధించడమంటే భావ ప్రకటనా స్వేచ్ఛకు ముప్పువాటిల్లినట్టేనని ఆయన పేర్కొన్నారు. ‘ఈ రోజుల్లో, చాలా చిన్న విషయాలకే ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయి . ఈ వాతావరణం ప్రమాదకరంగా మారింది’ ‘అబీర్ గులాల్ మూవీనే కాదు.. ఏ సినిమానైనా నిషేధించడాన్ని నేను వ్యతిరేకిస్తాను. పాకిస్తాన్ నటుడి సినిమాను ఇండియాలో బ్యాన్ చేయడం నాకు స‌రిగ్గా అనిపించ‌డం లేదు. ముందు సినిమా రిలీజ్ చేస్తేనే కదా మన ఆడియ‌న్స్ పాక్ న‌టుల సినిమాలు చూస్తారా లేదా అనేది తెలుస్తుంది. రిలీజ్ చేసి ఆ ఫ‌లితాన్ని వారికే వ‌దిలేస్తే మంచిది. తిమించిన అశ్లీలత, పిల్లలపై వేధింపులు ఉన్న చిత్రాలను మినహా వేటినీ నిషేధించకూడదు’అని అని ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు.

గతంలో ఇదే కారణంతో పలు వివాదాలు ఎదుర్కొన్న పలు సినిమాల గురించి కూడా ప్రకాశ్ రాజ్ మాట్లాడాడు. ‘పద్మావత్’, ‘పఠాన్’, ‘ఎల్2: ఎంపురాన్’, ఇప్పుడు ఫవాద్ ఖాన్ చిత్రం ‘అబిర్ గులాల్’. ఈ సినిమాలు సెన్సార్ బోర్డు ఆమోదం పొందాయి. కానీ రాజకీయ ఒత్తిడిని, ప్రజల ఆగ్రహాన్ని కూడా ఎదుర్కోవలసి వచ్చింది. పద్మావత్’ సినిమాలోని వేషధారణ, ‘పఠాన్’ సినిమాలోని ఒక పాట రంగు కారణంగా దీపికా పదుకొనేకు బెదిరింపులు వచ్చాయి. ఏకంగా ఆమె ముక్కు కోసేస్తామని జనాలు అంటున్నారు. ఇది కేవలం వారిపై కోపం మాత్రమే కాదు. బాగా ప్లాన్ చేసిన వ్యూహమని నా అభిప్రాయం. కొంతమంది భయానక వాతావరణాన్ని సృష్టించాలనుకుంటున్నారు.

సెన్సార్ బోర్డు ఆమోదం పొందినప్పటికీ, 2002 గోద్రా అల్లర్ల చిత్రీకరణ కారణంగా వివాదాన్ని ఎదుర్కొన్న చిత్రం ‘L2: ఎంపురాన్’. దీంతో నటుడు మోహన్ లాల్ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అలాగే కొన్ని సన్నివేశాలను తొలగించారు. దీనిపై కూడా స్పందించారు ప్రకాశ్ రాజ్. ‘కొన్ని సినిమాలు ఎటువంటి అడ్డంకులు లేకుండా థియేటర్లలోకి వస్తాయి. కానీ ఇతరులకు అంత సులభమైన అవకాశం లభించదు’ అంటూ ఇన్ డైరెక్టుగా ‘కాశ్మీర్ ఫైల్స్’ సినిమాను ప్రస్తావించారు ప్రకాశ్ రాజ్. మొత్తానికి ఈ నటుడి వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Please follow and like us:
వార్తలు సినిమా సినిమా వార్తలు