కాకినాడ జిల్లా తుని జగన్నాథగిరి గురుకుల పాఠశాలలో చదువుతున్న బాలికపై నిన్న నారాయణ రావు అనే వ్యక్తి లైంగిక దాడికి ప్రయత్నించాడు. నిందితుడు తాను బాలికకు తాతయ్యనని చెప్పి పాఠశాల నుంచి తీసుకెళ్లాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.
కాకినాడ జిల్లా తుని జగన్నాథగిరి గురుకుల పాఠశాలలో చదువుతున్న బాలికపై నిన్న నారాయణ రావు అనే వ్యక్తి లైంగిక దాడికి ప్రయత్నించాడు. నిందితుడు తాను బాలికకు తాతయ్యనని చెప్పి పాఠశాల నుంచి తీసుకెళ్లాడు. తోటలోకి తీసుకెళ్లగా, స్థానికుడు నిలదీయడంతో ఈ విషయం బయటపడింది. బాధితురాలి బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. న్యాయమూర్తి ముందు హాజరు పరిచేందుకు రాత్రి తీసుకువెళుతుండగా టాయిలెట్ వస్తుందని చెప్పిన నారాయణరావు.. చెరువులో దూకాడు.
రాత్రంతా వెతికీనా డెడ్ బాడీ దొరకలేదు. ఉదయం ఫైర్ , పోలీస్ సిబ్బంది గజ ఇతగాళ్లతో వెతకగా బాడీ దొరికింది. నారాయణరావు చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో సిగ్గుపడి ఆత్మహత్య ప్రయత్నం చేసి ఉండొచ్చు లేదా అనుకోకుండా చెరువులో పడిపోయి ఉండొచ్చు అని భావిస్తున్నాం అన్నారు పోలీసులు. స్కూల్ ఎదుట ఆందోళనకు దిగిన బాలిక బంధువులు… తాతయ్యనని చెబితే ఎలా పంపించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు స్కూల్ ప్రిన్సిపాల్‌ను కూడా విచారించారు.