గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సాయిబాబా క్యాటరింగ్ పనులకు వెళ్తుంటాడు. సాయిబాబాకు నల్గొండకు చెందిన శిరీషతో 2015లో వివాహం అయింది. వీరికి ఇద్దరూ పిల్లలున్నారు. పెళ్లైనా తర్వాత హైదరాబాద్‌లో కొంతకాలం పాటు కాపురం పెట్టారు. సంసారం సాఫీగా సాగుతుండటంతో దంపతులు ఆరు నెలల క్రితమే తెనాలి వచ్చారు.
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సాయిబాబా క్యాటరింగ్ పనులకు వెళ్తుంటాడు. సాయిబాబాకు నల్గొండకు చెందిన శిరీషతో 2015లో వివాహం అయింది. వీరికి ఇద్దరూ పిల్లలున్నారు. పెళ్లైనా తర్వాత హైదరాబాద్‌లో కొంతకాలం పాటు కాపురం పెట్టారు. సంసారం సాఫీగా సాగుతుండటంతో దంపతులు ఆరు నెలల క్రితమే తెనాలి వచ్చారు. రామలింగేశ్వర పేటలో నివసిస్తున్న వీరిద్దరిలో సాయిబాబా క్యాటరింగ్ పనులకు వెళ్తుండగా శిరీష మాత్రం బ్యూటీ పార్లర్ లో పనిచేస్తుంది.
ఇంతలోనే భార్యపై అనుమాన బీజం పడింది. దీంతో సాయిబాబా తరుచూ ఆమెతో గొడవపడుతుండేవాడు. ఎప్పటిలాగే మంగళవారం (జనవరి 27, 2026) కూడా భార్యతో ఘర్షణ పడ్డాడు. ఈ గొడవలో ఆమెపై దాడి చేశాడు. భర్త కొట్టడంతో శిరీష మంచంపై పడిపోయింది. అవేశంతో భార్య గొంతు నులిమి సాయిబాబు చంపేశాడు. కోపం తగ్గిన తర్వాత చూస్తే భార్య విగత జీవిగా పడి ఉంది. వెంటనే తేరుకున్న సాయిబాబా ఇంటి నుండి బయటకు వచ్చేశాడు. అయితే భార్య చనిపోయిన విషయాన్ని బంధువులకు చెప్పాలన్న ఉద్దేశంతో దారిలో ఎదురైన ఒక వ్యక్తి సెల్ ఫోన్ కావాలంటూ అడిగాడు. ఫోన్ చేసుకుని ఇస్తానని చెప్పిన సాయిబాబా ఆ ఫోన్ తీసుకొని అక్కడ నుండి పారిపోయాడు.
కొద్దీ దూరం వెళ్లిన తర్వాత హైదరాబాద్‌లో ఉంటున్న తన బావమరిదికి సమాచారం ఇచ్చాడు. శిరీష తాను గొడవ పడ్డామని ఆమె మంచంపై పడిపోయిందని చెప్పాడు. వెంటనే తెనాలిలో ఉన్న తన మేనల్లుడికి అదే విధంగా ఫోన్ చేసి చెప్పేశాడు. సాయిబాబా బావమరిది స్థానికంగా ఉండే బంధువులకు విషయం తెలియజేశాడు. స్థానికులు ఇంటికి వచ్చి చూడగా శిరీష మంచంపై విగతజీవిగా కనిపించింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. శిరీష చనిపోయిన విషయాన్ని బంధువులతో ధ్రువీకరించుకున్న సాయిబాబా పోలీసులకు లొంగిపోయాడు.
తల్లి చనిపోగా తండ్రిని పోలీసులు తీసుకెళ్లడంతో పిల్లలిద్దరూ అయోమయంలో పడిపోయారు. ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న చిన్నారులను ప్రస్తుతం తెనాలిలో ఉన్న బంధువులు తమ ఇంటికి తీసుకెళ్లారు. చిన్నారుల పరిస్థితి తలుచుకొని బంధువులు కంటతడి పెట్టారు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

