రికార్డ్‌ తిరగరాస్తున్న వెండి.. ప్రస్తుతం కిలో సిల్వర్‌ ఎంత ఉందో తెలిస్తే షాకవుతారు!

రికార్డ్‌ తిరగరాస్తున్న వెండి.. ప్రస్తుతం కిలో సిల్వర్‌ ఎంత ఉందో తెలిస్తే షాకవుతారు!

వెండి ఆకాశాన్ని తాకుతోంది. రోజుజుకు సునామీలా దూసుకుపోతోంది. అందనంత ఎత్తుకు పరుగులు పెడుతోంది. ఎప్పుడు తక్కువ ధర ఉండే సిల్వర్‌.. ఇప్పుడు ధర చూస్తేనే భయపడిపోతున్నారు వినియోగదారులు. రోజు వేల సంఖ్యలో పెరుగుతూ నాలుగు లక్షల రూపాయల చేరువలో ఉంది. ఇంకా మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయా?

బంగారం, వెండి ధరలు మందగించే సూచనలు కనిపించడం లేదు. సోమవారం భారత కమోడిటీ మార్కెట్ మూసి ఉంది. కానీ అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఔన్సుకు $5,000 దాటి పెరగడం కలకలం సృష్టించింది. మంగళవారం మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఫ్యూచర్స్ ట్రేడింగ్ ప్రారంభమైనప్పుడు వెండి ధరలు అకస్మాత్తుగా కిలోగ్రాముకు రూ.25,000 కంటే ఎక్కువగా పెరిగాయి. ఇంతలో బంగారం కూడా పెరిగింది. ఒకేసారి 10 గ్రాములకు రూ.3,700 కంటే ఎక్కువ పెరిగింది. ప్రస్తుతం బంగారం ధర రూ.1,61,950 వద్ద ట్రేడవుతోంది. అయితే గోల్డ్‌ ఈ రోజు మాత్రం నిలకడగానే ఉంది.

వెండి బూమ్ కొనసాగుతుంది. దాని వేగం ఇప్పుడప్పుడే తగ్గేలా కనిపించడం లేదు. మంగళవారం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడింగ్ సమయంలో కిలోకు రూ. 3,59,800 కొత్త జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకుంది. అంతకుముందు శుక్రవారం వెండి ధర రూ. 3,34,699 వద్ద ముగిసింది. దీనిని పరిగణనలోకి తీసుకుంటే దాని ధర రూ. 25,101 భారీగా పెరిగింది.

ప్రస్తుతం బంగారం ధర నిలకడగా ఉన్నప్పటికీ వెండిపై ఏకంగా రూ.10 వేల వరకు పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.3,87,000 వద్ద ట్రేడవుతోంది. ఒకప్పుడు వెండి అంత పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. ధర తక్కువే ఉంది. ఇప్పుడు సునామీలా దూసుకుపోతోంది. ఇప్పుడు వెండిపై ఇన్వెస్ట్‌మెంట్‌ చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.

బంగారం, వెండి ధరలు ఎందుకు ఆగడం లేదు? : బంగారం, వెండి ధరలు నిరంతరం పెరగడానికి గల కారణాల విషయానికొస్తే US డాలర్‌లో కొనసాగుతున్న బలహీనత, వడ్డీ రేటు తగ్గింపు అంచనాలు వారికి మద్దతు ఇచ్చాయి. కేంద్ర బ్యాంకులు తమ బంగారం కొనుగోళ్లను క్రమంగా పెంచుతున్నాయి. అలాగే బంగారు నిల్వలను పెంచుతున్నాయి. ఇంతలో ప్రపంచ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పెట్టుబడిదారులు సురక్షితమైన స్వర్గధామాలుగా బంగారం, వెండి వైపు మొగ్గు చూపుతున్నారు.

ట్రంప్ సుంకాల బెదిరింపుల మధ్య, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరాన్‌పై అమెరికా దాడి చేసే అవకాశం పెరిగింది. అమెరికా విమాన వాహక నౌకలు, యుద్ధనౌకలు మధ్యప్రాచ్యానికి చేరుకున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి.

Please follow and like us:
బిజినెస్ వార్తలు