ముంబైలో కాలి బూడిదైన ప్రైవేట్ ట్రావెల్స్.. జగిత్యాల నుంచి ముంబైకి వెళ్లిన బస్సులో మంటలు!

ముంబైలో కాలి బూడిదైన ప్రైవేట్ ట్రావెల్స్.. జగిత్యాల నుంచి ముంబైకి వెళ్లిన బస్సులో మంటలు!

ముంబై మలాడ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సులో మంటలు తీవ్ర కలకలం రేపాయి. కాండివిలీ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. తెలంగాణలోని జగిత్యాల నుంచి ముంబై మహానగరానికి వెళ్లిన బస్సులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.

ముంబై మలాడ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సులో మంటలు తీవ్ర కలకలం రేపాయి. కాండివిలీ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. తెలంగాణలోని జగిత్యాల నుంచి ముంబై మహానగరానికి వెళ్లిన బస్సులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే సంఘటానాస్థలానికి చేరుకున్న రెస్య్కూ టీమ్ మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కాగా, ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు.

అయితే షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే బస్సులో మంటలు చెలరేగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. బస్సులోని ప్రయాణికులందరూ అప్పటికే కిందకు దిగిపోవడంతో ప్రాణనష్టం తప్పింది. బస్సు మంటల్లో తగలబడిపోగా.. ఆ మంటల పొగ మెట్రో స్టేషన్ వరకు వ్యాపించింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానిక అధికారులు వెల్లడించారు. జగిత్యాల నుంచి ముంబై వెళ్లిన బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. తామంతా క్షేమంగా ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు